మనీ : రూ.2 లతో రూ.1.81 కోట్లు.. ఎలాగంటే..?

Divya
స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారా.. అంతే కాదు అందులో భాగంగానే ఎక్కువ రాబడి పొందాలని ఆలోచిస్తున్నట్లు అయితే అందుకు తగ్గట్టుగా మంచి మల్టీ బ్యాగర్ బెస్ట్ స్టాక్ లను కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే ఒక స్టాక్ గురించి మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాలి. 2021 సంవత్సరం లాగే ఈ సారి కూడా కొన్ని మల్టీ బ్యాగర్ లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక అలాంటి స్టాక్స్ లో ఒకటి ఫర్టిలైజర్ కంపెనీ రామ ఫాస్ఫేట్స్ స్టాక్.. ఇక స్టాక్ తన ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్ లను కూడా మనకు అందించింది.

కాకపోతే ఈ స్టాక్ యొక్క హిస్టరీ ని గనుక చూసుకుంటే ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించిందని చెప్పవచ్చు. రూ. 108 రూపాయల నుండి ఏకంగా రూ. 361 కి పెరిగిన ఈ స్టాక్ పోయిన ఏడాది 235 శాతానికి పైగా పెరిగి లాభాల వర్షం కురిపించింది. 5 సంవత్సరాల కాల వ్యవధిని చూసుకుంటే ఈ స్టాక్ ధర రూ. 75. 95 నుంచి రూ.362 పెరగడం. మొత్తంగా షేర్ హోల్డర్లకు 380 శాతం రిటర్న్ లను అందించింది. గత పది సంవత్సరాలలో చూసుకుంటే ఈ మల్టీ బ్యాగర్ షేర్ ధర ఏకంగా 610 శాతం పెరిగింది. ఇక 19 సంవత్సరాల క్రితం ఈ కంపెనీ షేర్ విలువ కేవలం 2 రూపాయలు మాత్రమే ఉండేది. అప్పటి నుంచి ఇప్పటికి ఏకంగా రూ.361 రూపాయలకు ఎగబాకింది.
అంటే ఉదాహరణకు గత 19 సంవత్సరాల క్రితం ఈ స్టాక్ లో లక్ష రూపాయలను పెట్టుబడి పెట్టినట్లయితే ఇప్పుడు 1.82 కోట్ల రూపాయలు లాభాలు వచ్చి ఉండేవి. ఇక ప్రస్తుతానికి షేర్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి అందుకు తగ్గట్టుగా మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటే మరికొంత కాలం లో రెట్టింపు చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: