వావ్: గృహిణులకు శుభవార్త..రూ.630 కే సిలిండర్..!!

Divya
ఈ మధ్యకాలంలో మీరు కూడా గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా..? అనే ప్రశ్న చాలా సిల్లీ గానే ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా గ్యాస్ సిలిండర్ వినియోగదారులే. అందుకే వినియోగం కూడా ఎక్కువ అవుతున్న తరుణంలో వనరులు తరిగిపోతున్నాయి. ఇక ఈ క్రమంలోనే రోజురోజుకు గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు చెప్పబోయే అందరికీ ఆనందాన్ని కలిగించే విషయం ఏమిటంటే..కేవలం 630 రూపాయలు నుంచి ఈ సిలిండర్ల ధర ప్రారంభం అవుతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ఇందులో ఉండే చిన్న కిటుకు ఏమిటంటే మనకు కేవలం పది కేజీల గ్యాస్ మాత్రమే వస్తుంది. ఇకపోతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న ట్లు గానే ప్రస్తుతం కాలంతో పాటు వారు కూడా మారాలి అని ఆలోచిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కంపెనీలు కూడా ఇప్పుడు సరికొత్తగా గ్యాస్ సిలిండర్ల బరువు విషయంలో మార్పులు తీసుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇవి సాధారణ సిలిండర్లు మాత్రమే కాదు.. ప్రస్తుతం చాలా కంపెనీల వరకు కంపోసైట్ గ్యాస్ సిలిండర్లను కూడా వినియోగదారులకు అందిస్తున్నాయి.
వీటి బరువు తక్కువగా ఉండడంతో పాటు ఎవరైనా సరే సులభంగా తీసుకెళ్లడానికి ఆస్కారం వుంటుంది. ప్రస్తుతం ఈ కంపోసైట్ గ్యాస్ సిలిండర్ ధర మార్కెట్ లో రూ.634 పలుకుతోంది. అయితే ఈ గ్యాస్ సిలిండర్ ధర ప్రాంతం యొక్క ప్రాతిపదికన మారుతూ ఉంటుంది అనే విషయాన్ని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. ఇక అంతే కాదు ఈ గ్యాస్ సిలిండర్ వల్ల మనకు ప్రయోజనం ఏమిటంటే ఇది పారదర్శకంగా కనిపించడం వల్ల ఇందులో ఎంత గ్యాస్ ఉందో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం పది కేజీల బరువుతో వస్తున్న గ్యాస్ సిలిండర్లు.. ఐరన్ సిలిండర్ తో పోలిస్తే సుమారుగా ఏడు కేజీలు లు బరువు తక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ  సిలిండర్లు బరువు తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ కాలం పటిష్టంగా వుంటాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: