మనీ: కొత్త ఏడాది కేంద్రం శుభవార్త.. వాటిపై ధర తగ్గిస్తూ..!!

Divya
కొత్త ఏడాది ప్రతి ఒక్కరికి శుభవార్త తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఇకపోతే వస్త్రాలు, చెప్పుల పై జిఎస్టి పెంచుతూ ప్రజలకు షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా వంటనూనెల ధరలు తగ్గిస్తూ వినియోగదారులకు మరింత ఊరట కలిగిస్తున్నామని కేంద్ర ఆహార శాఖ సూచించింది. ఇక దీంతో వంట నూనెను ఉత్పత్తి చేసే కంపెనీ లు కూడా 15 నుంచి 25 శాతం వరకు వంటనూనెల ధరలు తగ్గించాయి. ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి వంటనూనెలు తగ్గుతున్న విషయం తెలిసిందే.. కాకపోతే అంతర్జాతీయ ధరలు ఎక్కువగా ఉండడంతో రెండు మూడు నెలల నుంచి వంటనూనెల ధరలు పెరిగాయి . అయితే రాబోయే రోజుల్లో నూనెల ధరలు తగ్గిస్తున్నాము అని కంపెనీలు చెబుతున్నాయి.

మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులో ఉన్న రుచి గోల్డ్, ఫార్చ్యూన్, సన్ రిచ్, ఫ్రీడమ్, న్యూట్రెల్లా.. వంటి బ్రాండెడ్ వంటనూనె తయారీ సంస్థలు 20 శాతం వరకు తమ నూనెల ధరలు తగ్గించాయి. కాకపోతే ఈ ఏడాది జనవరి నెలలో సన్ ఫ్లవర్ నూనె పెరుగుతూ లీటర్ రేటు రూ. 180 కి చేరుకొని.. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఏదో ఒక నూనె అని సరిపెట్టుకున్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తగ్గిన ధరలపై సంతోషాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఇకపోతే మరో నాలుగు నెలలవరకు నూనెల ధరలు పెరిగే అవకాశమే లేదు అని తెలంగాణ ఆయిల్ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన సురేష్ కుమార్ అగర్వాల్ తాజాగా ఒక ప్రకటన వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం కూడా రిఫైండ్ ఆయిల్ పై జిఎస్టి ని 17.5 శాతం నుండి 12.5 శాతానికి తగ్గించింది. ఇక రిఫైన్డ్ ఆయిల్ ప్రస్తుతం 130 రూపాయలు ఉండగా దాని ధర మరో నాలుగు నెలల పాటు 110 రూపాయలు పలకబోతుంది.. ఇకపోతే పండుగ వేళ నూనె ధర తగ్గించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: