మనీ: అత్యవసర పరిస్థితుల్లో మనీ కావాలంటే ఇలా చేయండి..!!
ఇందుకోసం ఒక సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.. ఇప్పటికే ఎస్ బీ ఐ, తమ కస్టమర్లకు బ్యాంకుకు సంబంధించిన పనులను సులభతరం చేయడానికి yono యాప్ ను డెవలప్ చేసిన విషయం తెలిసిందే. అయితే వెంటనే వ్యక్తిగత రుణాలు పొందడానికి తాజాగా SBI ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ను ప్రవేశపెట్టింది. sbi yono యాప్ ద్వారా మీరు ఈ సేవను పొందవచ్చు.అయితే మీకు అత్యవసరంగా డబ్బులు అవసరం వచ్చినప్పుడు మొబైల్ ఫోన్ లో డోన్ లోడ్ చేసుకున్న యోనో యాప్లో నాలుగు క్లిక్లతో మీరు పర్సనల్ లోన్ అందించనున్నట్లు sbi పేర్కొంది
PAPL అనగా ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ను 24 గంటలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటుందని sbi తెలిపింది. ముందస్తు సమాచారం కోసం కస్టమర్లను ఎలాంటి ప్రశ్నలు అడగకుండా.. మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్న వాళ్లను ఎంపిక చేసి.. ఎస్ బీ ఐ లోన్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇకపై డాక్యుమెంట్లు, ఎంక్వరీలు లేకుండానే నేరుగా ఖాతాదారుల అకౌంట్లో జమ చేయనున్నట్లు పేర్కొంది. ఆసక్తి కలిగిన SBI కస్టమర్లు 567676కు "PAPL" అని మెసేజ్ చేసి, తద్వారా ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్లకు అర్హులు అవునో కాదో అని చెక్ చేసుకోవచ్చు. సంక్రాంతి పండుగ సందర్భంగా sbi మరో ఆఫర్ను అందిస్తుంది. ఈ ఆఫర్ కింద లోన్ తీసుకోవాలనుకునే వారు.. వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లించాల్సిన పని లేదు.