మనీ:కొత్త ఇల్లు కొంటున్నారా.. అయితే ఈ ఫార్ములా తప్పనిసరి..!!

Divya
నిజం చెప్పాలంటే మన దేశంలో ఇప్పటికే సొంత ఇల్లు లేని ఎంతోమంది పేద వారు తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు అని చెప్పవచ్చు. సొంత ఇంటిని నిర్మించుకోవాలని , తమ కలలని నెరవేర్చుకోవడానికి ఎన్నోరకాలుగా ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎన్నో కలలు కనీ గృహాన్ని నిర్మించుకోవడం కోసం కూడా వారు చాలా కష్టపడుతూ వుంటారు. ముఖ్యంగా ఇల్లు కొనే ముందు ఎవరైనా సరే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మించుకునేటప్పుడు హోమ్ లోన్ తీసుకోవడం తప్పనిసరి. ఈ హోమ్ లోన్ తీసుకున్న తర్వాత కూడా మనం జాగ్రత్తగా ఆ డబ్బును చెల్లించాల్సి ఉంటుంది.

హోం లోన్ తీసుకునేటప్పుడు కానీ చెల్లించే టప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంతో మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇల్లు కొనే ముందు 3/20/30/40 ఫార్ముల గురించి తెలుసుకుంటే రాబోయే కాలంలో వచ్చే ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం బాగా ఉంటుంది. 3/20/30/40 మూడు అనేది దేనిని సూచిస్తుంది అంటే మీరు ఇంటి కోసం చేసే మొత్తం ఖర్చు మీ ఆదాయానికి మూడు రెట్లు మించకూడదు అని తెలుసుకోవాలి. మీకు కనుక తక్కువ వార్షికాదాయం ఉంటే అందులో మూడు వంతుల  భాగం హోమ్ లోన్ ఉండేటట్టు చూసుకోవాలి అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి యొక్క వార్షిక ఆదాయం రెండు లక్షలు ఉన్నట్లయితే, ఆ వ్యక్తి తన ఇంటి కోసం చేసే ఖర్చు ఆరు లక్షలకు మించరాదు.

20 ఫార్ములా దేనిని సూచిస్తుంది అంటే గృహ రుణాల కాలం ఇరవై సంవత్సరాలకు మించకూడదు అని. 20 ఏళ్ల కంటే తక్కువ ఉంటే త్వరగా రుణాలను తీర్చుకోగలగుతాము. 30 అనే నంబర్ దేనిని సూచిస్తుంది అంటే అన్ని రకాలుగా చెల్లించే ఈఎంఐ మొత్తం కలిపి సంవత్సరాదాయం లో 30 శాతానికి మించ రాదు. 40 అనే నంబర్ దేనిని సూచిస్తుంది అంటే మీరు మీ ఇంటి లోన్ మొత్తం లో 40 శాతం డౌన్ పేమెంట్ రూపంలో చెల్లిస్తే సరిపోతుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని నిర్మించుకుంటే జాగ్రత్తగా ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: