మనీ : అంగన్వాడీ ఉద్యోగులకు శుభవార్త తెలిపిన ప్రభుత్వం..!!

Divya
అంగన్వాడీ ఉద్యోగులకు , సహాయ కార్యకర్తలకు జీతాలు పెంచకుండా ప్రభుత్వం వారిని ఎంతో ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే . అంతేకాదు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తూ తక్కువ జీతంతో పని చేయాలి అంటే ఎవరికైనా ఇబ్బందులు కలుగుతాయి.. కాబట్టి ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అంగన్వాడి కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, సహాయ కార్యకర్తలకు అందరికీ త్వరలోనే జీతాలు పెంచుతామని శుభవార్త తెలిపింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
ఉద్యోగస్తులను దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం మరోసారి అంగన్వాడీ కార్యకర్తలకు , సహాయ కార్యకర్తలకు అందరికీ జీతం పెంచుతామని చెప్పి శుభవార్త తెలపడం గమనార్హం. అంగన్వాడి టీచర్లకు ఆయాలకు కూడా 30% శాతం పెంచుతామని ప్రకటించడంతో అంగన్వాడి కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంగన్వాడి ఉద్యోగస్తులకు, ఆయాలకు జీతాలు పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగిపోయింది.
అంగన్వాడి కార్యాలయాల్లో పనిచేస్తున్న అంగన్‌వాడీ హెల్పర్లు, మినీ అంగన్‌వాడీ టీచర్ల జీతాలు ఇప్పటి వరకూ  6,000 రూపాయలు  ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్యోగస్తులు ప్రభుత్వం ఇచ్చే వేతనం సరిపోవడంలేదని కుటుంబ పోషణ ఉందని చెప్పడంతో అర్థం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఆరు వేల రూపాయల నుంచి 7,800 రూపాయలకు పెంచింది.. ఇక వీరితో పాటు అంగన్‌వాడీ టీచర్ల వేతనాలను రూ.10,500 నుంచి 13,650 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు..
ఇకపోతే  జూలై  నెల నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి రానుండగా కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నెల నుంచి  అందరి ఖాతాల్లోకి పెంచిన వేతనాలు  తమ ఖాతాల్లో జమ చేయనున్నారు. జూలై నెల నుంచి డిసెంబర్ నెల వరకు రావాల్సిన పెంచిన జీవితాన్ని ఈ నెలలో ఖాతా లో జమ చేస్తామని ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అందరికీ కొంచెం ఊరట కలిగింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: