మనీ: పాలసీ తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి..!!
సొంతంగా అధ్యయనం చేయడం:
పాలసీలు తీసుకునేటప్పుడు మనం సొంతంగా దగ్గరుండి పాలసీల గురించి తెలుసుకోవాలి. ఏ పాలసీ తీసుకుంటున్నాము.. దాని వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటి.. అనే విషయాలను ముందుగా గమనించాలి. అంతే కాదు ఇప్పుడు మనం తీసుకునే పాలసీ భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఉంటేనే ఆ పాలసీలు తీసుకోవడం ఉత్తమం.
ఆర్థిక లక్ష్యాలను చేదించే పాలసీ:
ప్రతి ఒక్కరు జీవితాలు , ఆకాంక్షలు, లక్ష్యాలు అనేవి వేరువేరుగా ఉంటాయి.. కాబట్టి మీ లక్ష్యాలను అర్థం చేసుకొని.. పెళ్లిళ్లు, మీ పిల్లల చదువులు, రుణాలు, వైద్య ఖర్చులు లేదా రిటైర్మెంట్ నిధిని ఏర్పాటు చేసుకోవడం వంటి రకరకాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పాలసీని ఎంచుకోవాలి. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత కూడా ఆదాయం పొందే పాలసీ తీసుకోవడం తప్పనిసరి.
పాలసీ నీ ల్యాప్స్ కానివ్వండి..
పాలసీ టర్మ్ పూర్తయ్యేవరకు సంవత్సర ప్రీమియం చెల్లించడం ఆపకుండా జాగ్రత్తపడాలి. ఇక మీరు ప్రతి సంవత్సరం ప్రీమియం చెల్లించడం వల్ల మీకు నిర్ణీత సమయంలో అనుకున్న దాని కంటే ఎక్కువ మొత్తంలో మీ చేతికి డబ్బు వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని బీమా పాలసీ తీసుకుంటే మీకు, మీ మీద ఆధారపడిన కుటుంబ సభ్యులకు భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. ఇకపై పాలసీ తీసుకుంటే తగిన జాగ్రత్తలు తప్పనిసరి.