మనీ: తక్కువ వడ్డీకే ఈ బ్యాంకులలో రూ.ఐదు లక్షల వరకు రుణం పొందవచ్చు..!!

Divya
ఈ మధ్య కాలంలో చాలా మంది బయట వ్యాపారస్తుల దగ్గర డబ్బులను వడ్డీకి తీసుకోవడానికి చాలా భయపడుతున్నారు.. ఎందుకంటే ప్రస్తుతం బయట అప్పు తీసుకోవాలి అంటే రెండు రూపాయలు, 10 రూపాయలు, అవసరమైతే 20 రూపాయలు వడ్డీ కి కూడా డబ్బులను తెచ్చుకుంటున్నారు. అత్యవసర పరిస్థితిలో తప్పదు కాబట్టి ఇలా చేస్తున్నారు.. కానీ మరికొంతమంది ముందు జాగ్రత్తతో బ్యాంకులలో లోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.. వారిలో మీరు కూడా లోన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారా.. ? ఇక పర్సనల్ లోన్ కోసం ఎదురుచూస్తున్నట్లు అయితే మీకు ఒక చక్కటి శుభవార్త.. ఇప్పుడు చెప్పబోయే ఈ బ్యాంకులలో అతి తక్కువ వడ్డీకే మీరు ఐదు లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు.
బ్యాంకు యొక్క ప్రాతిపదికన మనం తీసుకునే డబ్బు పై వడ్డీ రేట్లు కూడా మారుతూ ఉంటాయి. అందుకే తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే బ్యాంకులలో లోన్ కోసం ట్రై చేయడం చాలా ఉత్తమం.. ఏ బ్యాంకులు మనకు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..
ఎవరైతే పర్సనల్ లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారో.. అలాంటి వాళ్ళకు యూనియన్ బ్యాంక్ అలాగే సెంట్రల్ బ్యాంకులు తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ అందిస్తున్నాయి. ఇక్కడ వడ్డీరేటు 8.9 శాతం నుంచి ప్రారంభం అవుతుంది.. ఐదు సంవత్సరాల కాల పరిమితితో 5 లక్షల రూపాయలు రుణం గనుక తీసుకుంటే.. నెలకు రూ.10,355 రూపాయలను ఈఎంఐ కింద కట్టవచ్చు. ఇక అన్ని బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే పంజాబ్ నేషనల్ బ్యాంకు లో ప్రస్తుతం వడ్డీరేటు 8.95% నడుస్తోంది.
ఇకపోతే పర్సనల్ లోన్ పై ఇండియన్ బ్యాంకు లో 9.05 శాతం వడ్డీ ఉండగా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 9.45 శాతం వడ్డీకి ఇస్తున్నారు . ఇక ఐడిబిఐ బ్యాంకు లో 9.5 శాతం, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు లో 9.5 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 10 శాతం, ఎస్బిఐ 9.6 శాతం వడ్డీ రేట్లు ఉన్నాయి.. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకులో అయితే 10.25 శాతం, ఎస్ బ్యాంకు లో 10.40 శాతం ,ఐసిఐసిఐ బ్యాంకు లో 10.5 శాతం, కెనరా బ్యాంకు లో 11.25 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: