మనీ: హోమ్ లోన్ పొందే వారికి శుభవార్త..!!

Divya
దేశాంతరం పోయినా స్వతంత్రం ఉండాలని అంటారు పెద్దలు.. అందుకే ఎవరైనా సరే సొంత ఇంటి కలను సహకారం చేసుకోవడానికి రూపాయి రూపాయి కూడా పెట్టి తమ కలలను సహకారం చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే ఈ ఏడాదిలోనే మీరు మీ కొత్త ఇంటి కలను సహకారం చేసుకోవాలని అనుకుంటున్నారా.. లేదా ఈ పండుగ వేళ ఓ ఇంటివారు అవుదాం అనుకుంటున్నారా..? మీరు ఎలా అనుకున్నా సరే మీకు కొత్త ఇల్లు కావాలి అనుకుంటే , మీ కోసమే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.

ఎవరైతే హోమ్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నారో అలాంటి వారికి గతంలో కూడా మునుపెన్నడూ లేని విధంగా,  అతి తక్కువ వడ్డీకి ఇంటి రుణాలను ఇవ్వడానికి సిద్ధమైంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఈ విషయంపై బ్యాంకు యొక్క అధికారులు తాజాగా ఒక అధికారిక ప్రకటన కూడా చేశారు. అంతేకాదు తమ బ్యాంకులో ఎవరైతే హోమ్ లోన్ తీసుకుంటారో అలాంటి వారికి వడ్డీరేట్లను 6.40 శాతానికి తగ్గినట్లు అధికారులు ప్రకటించారు. ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గించిన వడ్డీ రేట్లు అక్టోబర్ 27 2021 సంవత్సరం నుంచి మనకు అమల్లోకి రానున్నట్లు సమాచారం..

మరో శుభవార్త ఏమిటంటే, ఈ వడ్డీ రేట్లు అనేది కొత్తగా ఎవరైతే హోమ్ లోన్ తీసుకుంటున్నారో ..అలాంటి వారికి మాత్రమే కాదు ..ఇప్పటికే ఇంటి రుణాలు తీసుకొని యూనియన్ బ్యాంకు కు ట్రాన్స్ఫర్ చేసుకునే వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది అట.. ఈ విషయంపై సదరు బ్యాంకు అధికారి మాట్లాడుతూ..పండుగల నేపథ్యం లోనే ఇంటి కొనుగోళ్ళు బాగా పెరుగుతున్నాయి.. అందుకే ఇలాంటి సమయంలోనే మేము ఈ నిర్ణయం తీసుకొని వినియోగదారులకు చాలా మేలు చేస్తున్నాము.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ఈ వడ్డీ రేట్లు మార్కెట్లో మరే ఇతర బ్యాంకు కూడా వినియోగదారులకు అందించడం లేదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: