మనీ: రైతన్నలకు మరోసారి శుభవార్త తెలిపిన జగనన్న..!

Divya
రైతన్నల కోసం ఈ మధ్య ప్రభుత్వాలు కొంతవరకు ఆలోచిస్తున్నాయనే చెప్పాలి. ఇకపోతే రైతన్నలను దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన జగనన్న ప్రభుత్వం ఇప్పుడు సరికొత్తగా మరో శుభవార్తను తీసుకొచ్చింది. అది ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా ప్రత్యామ్న్యాయ పంటలను సాగు చేసే రైతన్నల కోసం ఈ శుభవార్తని తీసుకొచ్చింది జగనన్న ప్రభుత్వం.జగన్ మోహన్ రెడ్డి తాజాగా అగ్రి ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన తర్వాత, కొన్ని ముఖ్యమైన  ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా…ధరల స్థిరీకరణ నిధి ద్వారా అన్నదాతలకు సహాయం  చేయాలని అధికారులకు సూచించారు.
ముఖ్యంగా రైతులు పండించిన పంటలకు ధరలను పెంచే మార్గంలోనే ప్రభుత్వము పాటుపడుతున్నట్లు సమాచారం. ప్రత్యామ్నాయ పంటల వల్ల భూమి సారం పెరగడంతో పాటు అధిక దిగుబడి కూడా పెరుగుతుంది అని, తద్వారా ధరలు కూడా పెరుగుతాయని ముఖ్యంగా రైతులలో విభిన్నమైన ఆలోచనలు కూడా వస్తాయని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందుకే ప్రత్యామ్నాయ పంటలు వేసే వారికి విత్తన గింజలతో పాటు ఎరువుల వరకు తక్కువ ధరకే రైతులకు అందిస్తామని ప్రభుత్వం చెప్పింది.
ప్రత్యామ్నాయ పంటల తోపాటు తృణధాన్యాల సాగుకు కూడా ప్రభుత్వం సహాయ పడుతుంది అని రైతులకు శుభవార్త తెలిపింది. అంతే కాదు పల్లెటూరు ప్రాంతాలలో జగనన్న పాలవెల్లువ అనే పథకాన్ని కూడా ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాలలో పశువుల సమృద్ధికి తోడ్పడనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొంతమంది ఈ పథకం గురించి తెలియక అమూల్ సంస్థ వారే వచ్చి పాలు తీసుకుంటారని తప్పుడు ప్రచారం చేసే వారిపై జగన్ మండిపడుతున్నాడు. పాలు పోసే రైతులు ఈ సంస్థలకు యజమానులు అని ,పాల ద్వారా వచ్చే లాభాలు  రైతులకు నేరుగా అందుతాయని జగన్ ప్రకటించడం గమనార్హం.
వ్యాపారుల దగ్గర లీటరు పాల ధర 70 రూపాయలు ఉన్నట్లయితే జగన్ ప్రభుత్వం 80 రూపాయలకు వాటిని కొనుగోలు చేస్తుంది అని కూడా ప్రకటించడం గమనార్హం. ఇక ఈ ప్రకటన చేయడంతో పాలు పోసే రైతులకు కొంత వరకు ఊరట లభించిందని చెప్పవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: