మనీ : ఇకపై పోస్ట్ ఆఫీసులలో సరికొత్త రూల్స్..!

Divya
దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీస్ రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం తెలిసినప్పటికీ, అందులో ముఖ్యంగా స్మాల్ సేవింగ్ స్కీమ్స్ కు ప్రతి ఒక్కరూ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.. ఇలా ఎందుకు అంటే , తక్కువ మొత్తంలో ప్రతి నెల డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ, ఒకేసారి మెచ్యూరిటీ కాలం ముగిసిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు పొందవచ్చు కాబట్టి..ఇలా ప్రతి ఒక్కరు ఈ స్కీం లను ఎంచుకుంటున్నారు. ఇకపోతే పోస్ట్ ఆఫీస్ సరి కొత్తగా ఆర్ డీ స్కీమ్లను ప్రవేశపెట్టే వాటిలో, డబ్బులు దాచుకునే విధంగా పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.. అయితే ఎవరైతే ఆర్ డీ లో డబ్బులు దాచుకుంటున్నారో అలాంటి వారు ఇప్పుడు తీసుకు వచ్చిన సరికొత్త రూల్స్ ను తెలుసుకోవాలి.

ఆర్ డీ పథకం యొక్క మెచ్యూరిటీ కాలం ఐదు సంవత్సరాలు అన్న విషయం తెలిసిందే..కానీ మీరు మెచ్యూరిటీ కాలాన్ని మరింత పెంచుకోవాలనుకుంటే మరో ఐదు సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు. అంతేకాదు మెచ్యూరిటీ తర్వాత కూడా మరో ఐదు సంవత్సరాల పాటు ఎటువంటి డిపాజిట్ చేయకుండా కొనసాగించవచ్చు. ఇక పోస్టాఫీసులలో ఆర్ డి స్కీం  కలిగిన వారు 12 ఇన్స్టాల్మెంట్ లలో ఏకంగా లోన్ కూడా పొందవచ్చు. అవసరం తీరిపోయిన తర్వాత ఒకేసారి అయినా లోన్ చెల్లించవచ్చు లేదా పన్నెండు విడతల్లో లోన్ ను చెల్లించవచ్చు. సాధారణ వడ్డీ కంటే ఆర్డీ లో వడ్డీ 2  శాతం తక్కువగా ఉంటుంది.
ఒకవేళ మీరు రుణం కనుక తీసుకున్నట్లయితే ,రుణాన్ని తీర్చిన తర్వాతనే మెచ్యూరిటీ డబ్బులు చేతికి అందిస్తారు. అయితే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన కొత్త రూల్ ప్రకారం ఆర్డీ లోన్ తీసుకున్నట్లయితే, లోనే కట్టలేని పరిస్థితులలో .. ఆర్డీ మొత్తంలో నుండి లోన్ డబ్బులను కట్ చేసుకుంటారు. ఆర్ డీ మొత్తంలో లోన్  డబ్బులను కట్ చేసుకుని,  మిగతా డబ్బులు మాత్రమే మన చేతికి ఇస్తారు. లోన్ తీసుకున్నా.. డబ్బులు తీర్చే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా.. సులభంగా మెచ్యూరిటీ కాలం తరువాత డబ్బులు మీ లోన్ మొత్తాన్ని కట్ చేసుకుని ఆ తర్వాత మిగిలిన డబ్బులు ఇస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: