మనీ: అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన ఎస్బిఐ..!

Divya
దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .. ఇటీవల అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది అది కూడా హోమ్ లోన్ ఆఫర్.. అయితే ఇంటి నిర్మించుకోవాలని లేదా కొనుగోలు చేయాలని చూస్తున్నారో..అలాంటి వారికి ఒక పెద్ద శుభవార్త అని చెప్పవచ్చు.. అంతే కాదు ఇప్పుడు దసరా పండగ సీజన్ కావడం వల్ల ఎస్బిఐ ఇలాంటి ఆఫర్లను ప్రకటించి కస్టమర్లకు మరింత చేరువ అవుతోంది.. మీరు కూడా కొత్త ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? లేక మీ అభిరుచికి తగ్గట్టు నిర్మించుకోవాలని చూస్తున్నారా..? మీరు ఎలా అనుకున్న సరే మీ ఆలోచనలకు తక్కువ మొత్తంలో ని సహకారం చేసేలాగా ఎస్బిఐ పాటు పడుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాల తో సంబంధం లేకుండా అన్ని రుణాలను ముఖ్యంగా గృహ నిర్మాణ వడ్డీరేట్లను 6.7 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఎవరైతే లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారో.. అలాంటి వారికి క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేటు తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ  ఆఫర్ కింద మీరు లోన్ కి అప్లై చేసేటప్పుడు కూడా ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు.. ఈ విషయాన్ని నేరుగా ఎస్బిఐ ప్రకటించడం గమనార్హం.
ఇకపోతే ఇప్పటి వరకు 75 లక్షల రూపాయల పైన గృహ రుణానికి.. కస్టమర్ల నుంచి  7.15 శాతం వడ్డీని స్వీకరించింది.. అయితే ఈ ఆఫర్ తో 6.7 శాతం వడ్డీకే  గృహ రుణాలను అందించనుంది.. మీరు 75 లక్షల రూపాయలను కనుక తీసుకున్నట్లయితే, దాదాపు 30 ఏళ్ల సంవత్సరాలలో ఋణాన్ని తీర్చుకుని, మీ ఇంటిని సొంతం చేసుకోవచ్చు.. ఇక ఎస్బిఐ ప్రకటించిన ఈ ఆఫర్ వల్ల 45 బేసిక్ పాయింట్ ల వడ్డీ ఆదాతో ఏకంగా రూ. 8 లక్షల వరకు భారీగా వడ్డీలేని రుణాలను  గ్రహీతలు ఆదా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా హోమ్ లోన్ తీసుకోవాలి అనుకుంటే వెంటనే దగ్గరలో ఉన్న ఎస్బిఐ ను సంప్రదించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: