మనీ: ఉద్యోగులకు శుభవార్త..వేతనంలో వృద్ది రేటు ఎంతంటే..?

Divya
2022 వ సంవత్సరానికి గాను ఉద్యోగులకు వేతనం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా వచ్చే ఏడాది సగటున 8.6% వేతనం పెరగనున్నట్లు డెలాయిట్ సర్వేలో వెల్లడించడం జరిగింది. ఇప్పుడు సడన్ గా వేతనం పెంచడానికి గల కారణం ఏమిటంటే, కోవిడ్ నిబంధనలతో ప్రస్తుతం సంక్షోభంలో చిక్కుకున్న వ్యాపార కార్యకలాపాలు, ఇటీవల పుంజుకుంటున్న విషయం తెలిసిందే. నిజానికి డెలాయిట్ నిర్వహించిన ఒక సర్వేలో పాల్గొన్న చాలా కంపెనీలు, 2022 సంవత్సరం నాటికి 25 శాతం సంస్థలు తమ కంపెనీల ద్వారా రెండంకెల వృద్ధి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాయి..

అంటే ప్రస్తుతం వేతనం 4.4 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే.. ఇప్పుడు దానిని సగటున 8 శాతానికి పెంచి మొత్తం 8.6 శాతానికి వేతనం పెంచేలా సంస్థలు నిర్ణయం తీసుకున్నట్లు సర్వే అంచనా వేసింది.. సర్వే ప్రకారం 2022 నాటికి ఐటీ సంస్థలలో వేతనాలు అధికంగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో ఉద్యోగులకు జీతభత్యాలు అందుతాయి అన్నమాట. కానీ హాస్పిటల్స్, రెస్టారెంట్ , రిటైల్, స్థిరాస్తి, మౌలిక రంగాలలో మాత్రం వేతనాలు పెంపు కు అనుమతి ఇవ్వలేదు.

ముఖ్యంగా ఉద్యోగుల యొక్క నైపుణ్యం అలాగే పనితీరును బట్టి సంస్థలు జీతాలు పెంచుతామని ప్రకటించాయి. అంటే సగటు పనితీరు కనబరిచిన ఉద్యోగులతో పోల్చుకుంటే, బాగా రంగంలో రాణిస్తున్న ఉద్యోగులకు 1.8 రెట్లు అధికంగా వేతనం చెల్లించాలని సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.  2021 సంవత్సరం లో 12 శాతం మందికి ఐటీ సంస్థల లో పదోన్నతులు లభించాయి. ఇక ప్రస్తుతం కొవిడ్ తర్వాత సంస్థలన్నీ మంచి ఆదాయం తో దూసుకుపోతున్న తరుణంలో, దాదాపు పన్నెండు శాతం కంపెనీలు వేతనాలను పెంచాయి. అంతేకాదు ఇతర ప్రయోజనాలను కూడా సవరించి,  జీతభత్యాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. కోవిడ్ నేపథ్యంలో 60 శాతం సంస్థలు కూడా ఉచితంగా ఆరోగ్య బీమా పాలసీలను అందించనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: