మనీ : తక్కువ సమయంలోనే పెన్షన్ పొందాలంటే ఇలా చేయండి..?

Divya
సాధారణంగా మనం ఏ పథకంలో చేరినా 60 సంవత్సరాలు దాటిన తర్వాతనే పెన్షన్ రూపంలో డబ్బులు తీసుకోవడం జరుగుతుంది..కానీ 40 యేళ్లకే పెన్షన్ వస్తే బాగుంటుంది కదా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అయితే అలాంటి వారికి ఇప్పుడు lic సరి కొత్త పథకం తీసుకొచ్చింది. దేశంలోని అతిపెద్ద భీమా సంస్థగా గుర్తింపు పొందిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 40 సంవత్సరాలకే పెన్షన్ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం.. అదేమిటో ఇప్పుడు మనం ఒకసారి చదివి తెలుసుకుందాం

ఆ పాలసీ పేరు ఎల్ఐసి సరళ్ పెన్షన్.. ఈ పాలసీ తీసుకున్న తర్వాత ప్రతినెల మనకు పెన్షన్ రావడం గమనార్హం.. ముఖ్యంగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఇటీవల ఎల్ఐసి ఈ పాలసీని రూపొందించడం జరిగింది. ఇక ఇందులో రెండు యాన్యుటీ ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మొదటి ఆప్షన్ ను మనం ఎంచుకున్నట్లు అయితే ఈ పాలసీ లో చేరిన పాలసీ దారుడు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ డబ్బులు ప్రతి నెల పొందుతాడు.
ఖాతాదారుడు మరణిస్తే, పెన్షన్ రావడం ఆగిపోతుంది..పాలసీదారుడి ఇచ్చిన డబ్బులు మొత్తం నూటికి నూరు శాతం నామినికి ఇవ్వడం జరుగుతుంది. రెండవ ఆప్షన్ ను ఎంచుకున్నట్లు అయితే ఖాతాదారుడు జీవిత భాగస్వామి బతికున్నంతకాలం పెన్షన్ లభిస్తుంది. ఒకవేళ ఆ ఇద్దరు మరణిస్తే ఆ పాలసీ డబ్బులు నామినీ కిఇవ్వడం జరుగుతుంది.. మీరు ఏదైనా ఒక ఆప్షన్ ను ఎంచుకున్నప్పుడు.. పాలసీ కొనసాగుతున్న సమయంలోనే మార్పులు చేసుకోవచ్చు.
అయితే ఈ పాలసీలో చేరాలనుకునే వారు 40 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ఠంగా  వయసు 80 సంవత్సరాలు వుండాలి. 40 సంవత్సరాలు నిండిన తర్వాత నెలకు వెయ్యి రూపాయలు లేడా మూడు నెలలకి 3,000, ఆరు నెలలకి 3,000 లేదా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలను పెన్షన్  కింద పొందవచ్చు.. మీకు పెన్షన్ ఎప్పుడు కావాలో కూడా పాలసీదారుడు నిర్ణయించుకునే అవకాశం ఇందులో కల్పించబడింది.
ఇక అంతే కాదు ఈ పెన్షన్ ఎంతకాలం కొనసాగుతుంది అనే విషయాన్ని కూడా పాలసీ తీసుకున్నప్పుడు మనం చెల్లించే మొత్తం పైన ఆధారపడి ఉంటుంది.. ఉదాహరణకు 60 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి మొత్తం 10 లక్షలు చెల్లించి ,ఈ పాలసీని కొనుగోలు చేసినట్లయితే ,సంవత్సరానికి 51,680 రూపాయలు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: