మనీ : ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త .. రూ.7 లక్షల వరకూ బెనిఫిట్ ..!

Divya
ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సరికొత్తగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు, ఏడు లక్షల రూపాయల విలువైన ప్రయోజనాన్ని అందించడం కోసం సరికొత్త నియమాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మైక్రో బ్లాగింగ్ సైట్ ద్వారా సరికొత్త నోటీసులు విడుదల చేయడం జరిగింది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఈపీఎఫ్ ఖాతాదారునికి, వీరి కుటుంబానికి ఏదైనా అవసరం అనిపించినప్పుడు సామాజికంగా సురక్షితంగా ఉండేందుకు , ఈపీఎఫ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఖాతాదారులకు ఈ - నామినేషన్ దాఖలు చేసుకోవాలని ఈపీఎఫ్ సూచించింది..

ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇటీవల తన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా ఇలా ట్వీట్ చేయడం జరిగింది. ఈపీఎఫ్ చందాదారులు అలాగే వారి కుటుంబాలకు కూడా సామాజిక భద్రత కల్పించడం కోసం ఈ రోజు ఈ - నామినేషన్ దాఖలు చేసుకోవాలని , ఈపీఎఫ్/ ఈపీఎస్  నామినేషన్ డిజిటల్ గా దాఖలు చేయడానికి, ఈ సులభమైన దశలను కూడా మీరు అనుసరించవచ్చు అని తెలపడం జరిగింది.
ఇక ఈ సంవత్సరం జూన్ లో ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం కింద ఈ భరోసా ప్రయోజనాన్ని సుమారుగా ఏడు లక్షల వరకు పెంపొందించింది ఈపీఎఫ్ఓ సంస్థ. ఈ పథకం కింద ఎవరైతే నమోదు చేసుకుంటారో వారందరికీ బీమా రక్షణ గా  ఈ డి ఎల్ ఐ పథకం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే సాధారణంగా ఈపీఎఫ్ ఖాతా నుంచి కొంతవరకు బెనిఫిట్ లభించేది. ఇప్పుడు దానిని ఏకంగా ఏడు లక్షల ఉచిత బీమా వరకు పొడిగించి పీఎఫ్ ఖాతాదారులకు ఊరట కలిగించారు.

అంతేకాదు ఈపీఎఫ్ ఖాతాదారులు హోమ్ లోన్ కూడా తీసుకునే వెసులుబాటు కల్పించారు. కేవలం హోం లోన్ కోసమే మాత్రమే కాదు పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు మరేదైనా వాహన కొనుగోలుకు కూడా లోన్ తీసుకునే వీలు కల్పించింది  ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంస్థ. ఇక ఈ పథకం జూన్ నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: