మనీ : రూ.1411 పెట్టుబడి తో రూ.35 లక్షలు ఆదా చేసుకోవచ్చు ..

Divya
ప్రతి నెల స్థిరమైన ఆదాయం ఉన్న వారు ఖచ్చితంగా, ఈ పథకంలో చేరడం వల్ల వృద్ధాప్యంలో ఆర్థికంగా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, మీ జీవితాన్ని కొనసాగించవచ్చు. ఇక వృద్ధాప్యంలో కూడా ప్రయోజనాన్ని అందించే విధంగా , హామీ ఇచ్చే రాబడి కోసం పోస్ట్ ఆఫీస్ లో సరికొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అందుకోసమే ఇప్పుడు కూడా ఒక సరి కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది పోస్ట్ ఆఫీస్.
ఆ పథకం ఏదో కాదు.. పోస్ట్ ఆఫీస్ గ్రౌండ్ సురక్ష లేదా హోల్ లైఫ్ అస్యూరెన్స్ అని పిలువబడే పథకంలో చేరినట్లయితే, కచ్చితంగా వృద్ధాప్యంలో అధిక రాబడిని పొందవచ్చు. ఇందులో చేరడానికి కనిష్టంగా 19 సంవత్సరాలు, గరిష్ఠంగా 55 సంవత్సరాలు ఉండవచ్చు. ఇక ఇందులో చేరాలనుకుంటే కనీసం పదివేల రూపాయల జీవిత బీమా తీసుకోవాలి. గరిష్ఠంగా 10 లక్షల జీవిత బీమా తీసుకోవాలి. ఇక ఇందులో నాలుగు సంవత్సరాలు పెట్టుబడి పెట్టిన తర్వాత, లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంటుంది.
ఇంకా ఐదు సంవత్సరాలు కాలపరిమితితో,  ఈ పథకాన్ని తీసుకున్నట్లయితే బోనస్ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇంకా ఎవరైనా ఒక వ్యక్తి 19 సంవత్సరాల వయస్సు కలిగినప్పుడు, 10 లక్షల మొత్తానికి ఈ పథకాన్ని  తీసుకున్నట్లయితే, 55 సంవత్సరాల నెలవారీ ప్రీమియం రూ.1515 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఇక 58 సంవత్సరాల వయసులో రూ.1463 ,అలాగే 60 సంవత్సరాల వయసులో రూ.1411.55 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
ఇక మెచ్యూరిటీ ప్రయోజనం కింద యాభై ఐదు సంవత్సరాలలో రూ. 31. 60 లక్షలు, ఇక 58 సంవత్సరాల వయసులో మెచ్యూరిటీ కింద రూ.33.40 లక్షలు ,అలాగే 60 సంవత్సరాల వయసులో మెచ్యూరిటీ బెనిఫిట్ కింద రూ.34.60 లక్షలు పొందవచ్చు. ఎవరైతే ఈ పథకంలో చేరాలని అనుకుంటారో, అలాంటి వారు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇక టోల్ ఫ్రీ నెంబర్ 1800 180 5232/155232. కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు లేదా  https://www.postallifeinsurance.gov.in వెబ్ సైట్ ను సందర్శించి ఈ పథకం లో ఉన్న అన్ని సూచనలను తెలుసుకొని పథకంలో చేరవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: