మనీ : రూ.30 సేవింగ్ తో రూ.4 లక్షలు మీ సొంతం..

Divya
 
మోడీ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని మధ్యతరగతి , అట్టడుగు పేద ప్రజల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను అందుబాటులోకి తీసుకురావడం.. మనం చూస్తూనే ఉన్నాం.. ఈ నేపథ్యంలోనే రెండు సరికొత్త పథకాలను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.. అయితే ఈ పథకాల గురించి పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రధానమంత్రి తీసుకొచ్చిన రెండు రకాల సరికొత్త స్కీములలో ఒకటి  ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అయితే , మరొకటి ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన. ఈ రెండు లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్లను  ఒక్క పథకం లో భాగంగానే చెప్పుకోవాలి. ఇందులో ముఖ్యంగా ఈ పథకాలలో ఎవరైతే చేరుతారో, వారు  నాలుగు లక్షల రూపాయల వరకు బెనిఫిట్స్ ను పొందవచ్చు. అంతే కాదు ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా సుమారుగా నాలుగు లక్షల వరకు లాభం వస్తుందని చెప్పవచ్చు. ముందుగా ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ లో చేరాలి అనుకునేవారు సంవత్సరానికి పన్నెండు రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం మే నెలలో మన ఖాతా నుంచి 12 రూపాయలను చెల్లించాలి.
ఇక ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా పథకం అనేది కూడా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కాబట్టి , ఇందులో 2 లక్షల వరకు జీవిత బీమా బెనిఫిట్స్ పొందవచ్చు.  ఇక ఇందులో చేరడానికి 18 సంవత్సరాల వయసు నుంచి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు అవుతారు. అయితే ఈ స్కీమ్లో ఎవరైతే చేరుతారో, వారు కూడా వారి  ఖాతా నుంచి 330 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో మీరు ప్రతి నెల 330 రూపాయలను అంటే, నెలకు 30 రూపాయలను ఆదా చేయడం వల్ల ఈ పాలసీ లో లాభం చేకూరుతుంది. అంటే 30 రూపాయలతో నాలుగు లక్షల రూపాయలను జీవిత బీమా కింద పొందవచ్చు అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: