మనీ : ఈ పాలసీ కేవలం ఆడపిల్లలకు మాత్రమే.. బంగారు భవిష్యత్తుకు పునాది..!

Divya
డబ్బు..డబ్బు.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏం చేయాలన్నా..?ఏం కావాలన్నా..? ఈ డబ్బు అనేది ప్రతి ఒక్కరికి ముఖ్య అవసరంగా మారింది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే దేశంలోనే బీమా దిగ్గజం అయినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఎన్నో పాలసీలను కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకు వస్తోంది. ముఖ్యంగా ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని ఎల్ఐసి సరికొత్త పథకాలను ప్రవేశపెడుతోంది. ఎందుకంటే వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఎవరికైతే కూతురు జన్మించి,  ఉంటుందో అలాంటి వారు జీవన్ లక్ష్య పాలసీ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలను పొందవచ్చు అని చెప్పవచ్చు. కూతురు పేరు మీద ఈ పాలసీలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ పాప పెద్దయ్యాక చదువుల కోసమో లేక పెళ్లి కోసం ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు. ఇతర పాలసీలతో పోల్చుకుంటే ఈ పాలసీ చాలా మంచి రాబడిని అందిస్తుంది. ఈ పథకంలో ఎవరైతే చేరుతారో వాళ్లకు మెచ్యూరిటీ సమయం తర్వాత డబ్బులు అధిక మొత్తంలో  పొందే వీలు ఉంటుంది.
ఇకపోతే మధ్యలోనే పాలసీదారు దురదృష్టవశాత్తు చనిపోతే , ఇక ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాదు నిర్ణీత కాలం ఉన్నంతవరకు పాలసీలో పది శాతం రాబడిని కూడా పొందే అవకాశం ఉంటుంది. 13 యేళ్ళ నుంచి 25 యేళ్ళ లోపు ఉన్న  ఆడపిల్లలు ఈ పథకంలో చేరడానికి అర్హులు. అంతేకాదు ఈ పాలసీ లో చేరిన తరువాత ఇరవై నాలుగు నెలలు గడిచిన తర్వాత  లోను కూడా తీసుకునే వెసులుబాటు కల్పించబడింది. ఇందులో రోజుకు 125 రూపాయలు చొప్పున ఆదా చేస్తూ పోవడం వల్ల మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 27 లక్షల రూపాయలను పొందే వీలు ఉంటుంది. అయితే 10 లక్షల రూపాయల విలువ గల బీమా మొత్తానికి పాలసీని తీసుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: