మనీ : రూ.10 వేలు ఆదాతో రూ.7 లక్షలు మీ సొంతం..

Divya
ఇటీవల కాలంలో పెట్టిన డబ్బు ఎక్కువ కావాలన్నా, సెక్యూర్ గా ఉండాలన్న అందుకు పోస్ట్ ఆఫీస్ లు అతి ముఖ్యమైనవి అని చెప్పవచ్చు. డబ్బు ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభం ఎక్కువగా ఉండడంతో పాటు తక్కువ మొత్తంలో ఎక్కువ రాబడిని పొందవచ్చు. ఆర్థికంగా ప్రజల శ్రేయస్సును కోరుకునే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి స్కీం లను అందుబాటులోకి తీసుకు వస్తున్నప్పటికీ, ఈ పోస్ట్ ఆఫీస్ లో ప్రవేశపెట్టే స్కీం ల వల్ల ప్రజలకు ఎంతో లాభం చేకూరుతుంది. ఇకపోతే పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన సరికొత్త పథకం లో ప్రతి నెలా కొంత మొత్తంలో డబ్బు ఆదా చేస్తూ, ఓకే సమయంలో ఏకంగా ఏడు లక్షల రూపాయలను పొందవచ్చు.

అలా పోస్ట్ ఆఫీసులు ప్రవేశపెట్టిన రికరింగ్ డిపాజిట్ స్కీం కూడా ఒకటి. ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల అధిక మొత్తంలో రాబడి పొందడమే కాకుండా 5.8 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. ఇక ఈ రికరింగ్ డిపాజిట్ స్కీం లో ఖాతాదారులు వంద రూపాయల నుంచి కూడా డబ్బులను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రికరింగ్ డిపాజిట్ స్కీం యొక్క కాలపరిమితి 5 సంవత్సరాలు కాబట్టి ప్రతి నెలా కొంత మొత్తం డబ్బులు ఇన్వేస్ట్  చేస్తూ ఒకేసారి పెద్ద మొత్తంలో ఎక్కువ డబ్బులు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది.
ఇక ఈ స్కీమ్లో సింగిల్ అకౌంట్ అయినా తీసుకోవచ్చు లేదా జాయింట్ అకౌంట్ అయినా తీసుకోవచ్చు కానీ పిల్లలను ఈ స్కీం లో చేర్చడం వల్ల నామిని తప్పకుండా అవసరం అవుతుంది. అలాగే ఇందులో గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. కనిష్టంగా వందరూపాయల నుంచి ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లలోనే ఎక్కువ మొత్తాన్ని పొందవచ్చు.
ఉదాహరణకు మీరు నెలకు పదివేల రూపాయలను ఈ స్కీం లో చేస్తున్నారు అని అనుకుందాం. ఇందులో 5.8 వడ్డీ కూడా లభిస్తుంది. కాబట్టి ఐదు సంవత్సరాల తర్వాత ఏడు లక్షల రూపాయలు మీ చేతికి వస్తాయి . మీరు ఐదు సంవత్సరాల్లో నెలకు పదివేల రూపాయల చొప్పున ఆరు లక్షల పొదుపు చేస్తే , లక్ష రూపాయలు వడ్డీ కింద అదనంగా లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: