మనీ : పాలసీదారు చనిపోతే డబ్బులు క్లైమ్ చేయడం ఎలా..?

Divya
దేశీయ అతిపెద్ద బ్యాంక్.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో..సాధారణంగా ఎవరైనా పాలసీ లలో చేరే ముందు అయినా సరే, చేరిన తర్వాత అయినా సరే ఒకవేళ అనుకోకుండా పాలసీదారు మరణిస్తే.. ఇన్సూరెన్స్ డబ్బులను మధ్యలోనే ఎలా క్లైమ్ చేసుకోవాలి.. పాలసీదారు నామినీగా ఎంచుకున్న వారు మాత్రమే డబ్బులను క్లైమ్ చేసుకోవాలా..? లేక కుటుంబ సభ్యులలో ఎవరైనా సరే ఈ డబ్బులను క్లెయిమ్ చేసుకోవచ్చా..? పాలసీదారు మరణించిన ఎంత కాలానికి ఈ పాలసీ డబ్బులను క్లైమ్ చేయడం జరుగుతుంది..?ఎలా డబ్బులను క్లైమ్ చేసుకోవాలి..? దీనికి గల ప్రొసీజర్ ఏమిటి..? అనే సందేహాలతో ఎంతోమంది పాలసీలలో చేరడానికి కూడా భయపడుతూ ఉంటారు. అన్ని ప్రశ్నలకు ఇప్పుడు ఒకే సమాధానం గా మనం తెలుసుకుందాం..

ముందుగా పాలసీదారుడు మరణిస్తే, ఆ డబ్బులను కేవలం నామిని మాత్రమే క్లైమ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎల్ ఐ సి లో పాలసీదారుడు ఎవరినైతే నామినీగా ఉంచుతాడో, అతను మాత్రమే డబ్బులను క్లైమ్ చేసుకోవచ్చు.
ఇక పాలసీదారుడు మరణించినప్పుడు, ఆ డబ్బులను నామిని క్లైమ్ చేసుకోవాలనుకుంటే, పూర్తిగా ఆఫ్ లైన్ ద్వారా నే డబ్బులను క్లైమ్ చేసుకోవచ్చు. ముందుగా పాలసీదారుడు ఏ బ్రాంచ్ కైతే పాలసీని కట్టారో, ఆ బ్రాంచ్ కి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.
బ్రాంచ్ ఆఫీస్ కి వెళ్లేముందు పాలసీదారుడు పాలసీ తీసుకున్న ఏజెంట్ దగ్గరైనా లేదా ఆ ఏరియాకి సంబంధించిన డెవలప్మెంట్ ఆఫీసర్ తో నైనా సరే సంతకం తీసుకొని , ఆ తర్వాత ఎల్ఐసి ఆఫీస్ కు వెళ్ళవలసి ఉంటుంది.
సంతకం పెట్టించుకున్న ఫామ్ ను తీసుకొని బ్రాంచ్ ఆఫీస్ లో ఉన్న మేనేజర్ కు ,పాలసీదారుడు మరణించారు అనే విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న బ్రాంచ్ అధికారులు ఫామ్ నెంబర్ 3801,ఫామ్ నెంబర్ 3783, ఫామ్ లతోపాటు నెఫ్ట్ ఫామ్ లను కూడా ఇవ్వడం జరుగుతుంది..
ఈ ఫామ్ లను పూర్తిగా నింపి, ఆ తరువాత పాలసీదారుడు యొక్క ఒరిజినల్ డెత్ సర్టిఫికెట్ తో పాటు పాలసీ బాండ్ , ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్, పాలసీదారుడు అన్ని పత్రాలకు సంబంధించిన జిరాక్స్ కాపీలు తీసుకొని , నామినికి సంబంధించిన ఓటర్ ఐడి ,ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇలా అన్నింటి పై నామిని సంతకం చేసి, బ్రాంచ్ ఆఫీసులో సమర్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు నామిని దారుడు ఎప్పుడు చనిపోయాడు..? ఎలా చనిపోయాడు..? ఎక్కడ చనిపోయాడు..? అనే విషయాలతో ఒక ఇంటిమేషన్ లెటర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక తరువాత నామిని బ్యాంకు పాస్ బుక్  అలాగే నెఫ్ట్ ఫామ్లో బ్యాంకు వివరాలను కూడా అందించి, బ్యాంకులో సమర్పించినపుడు క్లైమ్ డబ్బులు మంజూరు చేయబడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: