మీకు UAN వివరాలు తెలియదా ? పర్లేదు ఇలా EPF బ్యాలన్స్ తెలుసుకోండి ?

VAMSI
మాములుగా ప్రస్తుతం టెక్నాలజీ ఎంత అభివృద్ది చెందిందంటే మనము ఇంటి నుండి కాల్;యూ బయట పెట్టకుండానే మనకు అవసరమైన పనులన్నీ ఆన్లైన్ ద్వారానే చేసుకోవచ్చు. దీని కోసం ఆన్లైన్ లో ఎన్నో యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. వీటి సాయంతో ఎంతో సులభంగా మరియు వేగంగా పనులను చేసుకోగలుగుతున్నాము.  ఇప్పుడు ఇదే విధంగా ప్రోవిడెంట్ ఫండ్ ఖాతాదారులు వారి యొక్క నిలువ అమౌంట్ వివరాలను తెలుసుకోవడానికి చాలా మార్గాలున్నాయి. అయితే వాటికీ మీరు మీ ప్రోవిడెంట్ ఫండ్ కు సంబంధించిన యుఏఎన్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. దానిని ఎంటర్ చేసిన తరువాతనే మీరు పీఎఫ్ ఖాతా యొక్క బాలన్స్ వివరాలను తెలుసుకోవడానికి వీలవుతుంది. 

అయితే ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం యుఏఎన్ నెంబర్ లేకుండా కూడా మీ పీఎఫ్ ఖాతా బాలన్స్ ను తెలుసుకోగలరు. ఈ విషయం చాలా మందికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. ప్రతి సంవత్సరం ఉపయోగంలో ఉన్న ప్రోవిడెంట్ ఫండ్ చట్టం ప్రకారం పీఎఫ్ వడ్డీ రేట్లను ప్రకటించడం తెలిసిందే. అయితే ఈ ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజషన్ అనేది పూర్తిగా ప్రైవేట్ ఉద్యోగుల పొదుపుకోసం ఏర్పాటు చేయబడిన సంస్థ.
చాలా మందికి యుఏఎన్ వివరాలు గుర్తుండవు. కానీ అలాంటి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ

పీఎఫ్ రికార్డుల్లో రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్ నుండి ఒక మిస్డ్ కాల్ ను 011-229014016 కు ఇవ్వడం ద్వారా, మీరు ఎటువంటి వివరాలు లేకుండా పీఎఫ్ ఖాతా యొక్క బాలన్స్ ను తెలుసుకోవచ్చు. అయితే ఇలా మీకు ఒక మిస్డ్ కాల్ ద్వారా బ్యాలన్స్ వివరాలు పొందాలంటే, మీరు ముందుగానే యుఏఎన్ పోర్టల్ లో KYC పూర్తి చేయాలి. అప్పుడే మీ వివరాలు అందులో నిక్షిప్తం అయ్యి మిస్డ్ కాల్ ఇవ్వగానే అది చెక్ చేసి బాలన్స్ వివరాలను మీకు మొబైల్ ద్వారా సంక్షిప్త సందేశం రూపంలో అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ రోజే ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు తెలిసిన వారు యుఏఎన్ వివరాలు మరిచిపోయి ఉంటే తెలియచేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: