
మనీ : మీకు తెలియకుండానే మీ డబ్బు పొరపాటున ఇతరుల అకౌంట్ కు చేరిందా ?
ప్రస్తుతం అయితే ఏటీఎం సెంటర్లు, పేటీఎం, గూగుల్ ప్లే, మొబైల్ బ్యాంకింగ్ వంటివి వచ్చాయి కాబట్టి మన తనిఖీ లేనిదే, ఏవీ కూడా ఇతరుల అకౌంట్ కు వెళ్లడం చాలా కష్టం. కానీ పొరపాటునో, ఏమరపాటునో ఏదో ఒక కారణం చేత అనుకోకుండా,ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఒకరికి పంపాల్సిన డబ్బును మరొకరికి బదిలీ చేస్తూ ఉంటాము. తిరిగి తెలిసిన తర్వాత టెన్షన్ పడుతూ, బ్యాంకుల చుట్టూ తిరిగి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఇలా వేరొకరి ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాటిని ఎలా తిరిగి పొందాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ లు అందుబాటులోకి వచ్చాక, అందులోనూ అందరికీ ఉపయోగపడే విధంగా మనీ ట్రాన్స్ఫర్ వెబ్సైట్ లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి బ్యాంకుల చుట్టూ తిరుగుతూ,క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా, కేవలం చేతివేళ్ళ లోనే క్షణాల్లో పని ముగిసిపోతుంది. లక్షకు లక్షల రూపాయలు కేవలం ఈ యాప్ ల ద్వారానే ఇతరులకు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఒకవేళ పొరపాటున ఇతరుల బ్యాంకు అకౌంట్ కు వెళ్ళిన డబ్బును తిరిగి పొందాలంటే, ఏం చేయాలో బ్యాంక్ ఆఫ్ బరోడా అలాగే యూపీఐ ట్విట్టర్ ద్వారా వివరించాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా..మీరు ఒకవేళ పొరపాటున ఇతరుల బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు బదిలీ చేసినట్లు అయితే, అలాంటి పొరపాట్లకు బ్యాంకు ఎలాంటి బాధ్యతలు వహించదు. కాకపోతే డబ్బులు ఒకసారి మాత్రమే వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డబ్బు బదిలీ చేసేటప్పుడు జాగ్రత్తగా, డబ్బులు ఇతరుల ఖాతాలోకి జమ చేయకుండా వుండాలి అంటూట్వీట్ చేసింది.
ఇక యూపీఐ కూడా..లావాదేవీలు జరిపేటప్పుడు కచ్చితంగా జాగ్రత్తగా,అన్ని వివరాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. పొరపాటున తప్పుడు వివరాలను నమోదు చేసినట్లయితే మీ డబ్బు ఇతరుల ఖాతా కు వెళ్లే ప్రమాదం ఉంది. ఒకవేళ ఏదైనా అలా పొరపాటు జరిగినట్లయితే తక్షణమే బ్యాంకుకు వివరించాల్సి ఉంటుందని యూపీఐ తన ట్విట్టర్ ద్వారా పేర్కొంది.
ఒకవేళ పొరపాటున ఇతరుల ఖాతాలోకి డబ్బులు వెళ్ళినప్పుడు, అతని ఖాతా కూడా ఓకే బ్యాంకుకు సంబంధించినట్లయితే వెంటనే బ్యాంక్ మేనేజర్ కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదు మేరకు ఎవరైతే డబ్బు తీసుకున్నారో, వారిని బ్యాంకు సిబ్బంది సంప్రదించి డబ్బును వెనక్కి పంపమని రిక్వెస్ట్ పెడుతుంది. ఒకవేళ లబ్ధిదారుడు అంగీకరించినట్లయితే 7 పని దినాలలో మీ డబ్బు వెనక్కు వస్తుంది.