మనీ: NPS ద్వారా రూ.53 లతో రూ.1 కోటి మీ సొంతం.

Divya

ప్రతి ఒక్కరూ తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ, చివరికి ఎక్కువ మొత్తంలో లాభాలు ఆర్జించాలని ఆశిస్తూ ఉంటారు. ఇక వీరి ఆలోచనలకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వాలు, బ్యాంకులు , పోస్టాఫీసులు సైతం సరికొత్త స్కీమ్ లతో ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం అందుబాటులోకి తెస్తున్నాయి. ఇప్పుడు సరికొత్తగా ఇదే బాట లోనే కేంద్రం కూడా మరొక అడుగు ముందుకు వేసింది.. ముఖ్యంగా కరోనా కాలంలో ఎవరైతే డబ్బును ఆదా చేయాలని అనుకుంటున్నారో అలాంటి వారికి ఈ స్కీమ్ చక్కగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు.


అయితే ఆ స్కీమ్ ఏమిటి? ప్రతి నెల ఎంత కట్టాలి? ఎన్ని సంవత్సరాలు కట్టాలి? ఒకవేళ  కట్టిన తరువాత చివర్లో ఎంత డబ్బు ఇస్తారు? ఈ స్కీం యొక్క కాల పరిమితి ఎంత? ఈ స్కీం  కోసం అప్లై చేయడానికి ఏమేమి అవసరం అవుతాయి? అనే ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మీరు ఇంట్లో కూర్చునే ఎన్‌పీఎస్ (NPS) అకౌంట్ తెరవొచ్చు. ఈ అకౌంట్ తెరవడం వల్ల పలు రకాల ప్రయోజనాలను కూడా పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే రాబడితోపాటు పన్ను ను కూడాఆదా చేసుకోవచ్చు.  దీనిని  కస్టమర్లకు కోసం పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ PFRDA శుభవార్త అందించింది. ఆన్‌లైన్ ఈకేవైసీ ద్వారా నేషనల్ పెన్షన్ సిస్టమ్ NPS స్కీమ్‌లో చేరేందుకు అవకాశం కల్పిస్తోంది. దీంతో మీరు సులభంగానే ఎన్‌పీఎస్ ఖాతా తెరవొచ్చు. దీని కోసం ఈఎన్‌పీఎస్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి.

అలా వెళ్లేటప్పుడు మీతో పాటు ఆధార్ కార్డు నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. మీరు రోజుకు రూ.53 ఆదా చేసి, నెల చివరిలో ఎన్‌పీఎస్ ఖాతాలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. అంటే మీరు నెలకు రూ.1590 కట్టినట్లు అవుతుంది. ఉదాహరణకు మీకు 20 సంవత్సరాలు ఉన్నాయని అనుకుంటే, అలా మీరు 40 సంవత్సరాలు అంటే మీకు 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి నెల ఎన్ పీఎస్ అకౌంట్లో  రూ.1590 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తే మీకు రూ.కోటికి పైగా వస్తాయి. ఎవరైనాసరే 60 ఏళ్లు వయసు వచ్చే వరకు డబ్బులు కడుతూనే రావాలి. 18 ఏళ్లు వయసు కలిగిన వారు ఎవరైనాసరే ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరవచ్చు. 60  ఏళ్లలోపు వయసు కలిగిన వారు చేరవచ్చు.కనీసం రూ.500తో కూడా ఎన్‌పీఎస్ ఖాతా తెరవచ్చు.  అయితే ఇందుకోసం మీకు బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ వంటివి ఖచ్చింతంగా  అవసరం అవుతాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: