మనీ : వ్యాక్సిన్ చేయించుకునే వారికి బంపర్ ఆఫర్..! నేరుగా డబ్బులు మీ అకౌంట్ లోకే..
గత పోయిన సంవత్సరం కరోనా విజృంభించి, ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఈ తీవ్రత కొంత వరకు తగ్గిందనే చెప్పవచ్చు.. కానీ చాలా మంది ఈ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. ఇక ఇందుకోసమే కేంద్రం ప్రజలను ఆకర్షించేందుకు మరో అడుగు ముందుకు వేసింది.. అదేమిటంటే వ్యాక్సిన్ వేయించుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లపై అదనపు వడ్డీని పొందవచ్చట.. అయితే దాని వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వివిధ ప్రైవేట్ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ ఆఫర్ ను అందిస్తున్నాయి. సాధారణ కస్టమర్లకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25 బేసిస్ పాయింట్ల వడ్డీరేటును అదనంగా ఆఫర్ చేస్తోంది . ఇక సీనియర్ సిటిజన్ అయితే మరో 25 బేసిస్ పాయింట్లు పొందే వెసులుబాటు ఉంది.. ప్రజల్లో చైతన్యాన్ని నింపడం కోసం అలాగే కరోనా నేపథ్యంలో వ్యాక్సినేషన్ ను, ప్రోత్సహించే క్రమంలో సామాజిక బాధ్యతలో భాగంగా ఈ అవకాశాన్ని తీసుకుంటున్నట్లు బ్యాంకులు ఒక ప్రకటనలో తెలిపాయి..
ఆరోగ్యకరమైన సొసైటీని నిర్మించాలనే ఉద్దేశంతోనే, అదనంగా 25 శాతం వడ్డీ రేటును అందించనున్నట్లు 1111 రోజులకు గాను, ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీం ను జత చేయనున్నట్లు బ్యాంకు వెల్లడించింది. ఇక ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడుతున్నారో అలాంటివారిని, ఇలాంటి ఆసక్తికరమైన ఆఫర్లను ప్రకటిస్తూ పౌరులను వ్యాక్సినేషన్ దిశగా ప్రోత్సహించేందుకు ఈ ఆఫర్ ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది బ్యాంక్ రంగం.
ఇక కరోనా సమయంలో పౌరులు వ్యాక్సిన్ వేయించుకోవాలని బ్యాంకులు కోరుతున్న విషయం తెలిసిందే.. కానీ అందరూ ఈ మాటలను పెడచెవిన పెడుతుంటే, ఇక చేసేది లేక ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆకర్షణీయ వడ్డీ రేటును పొందవచ్చని పేర్కొన్నాయి.. ఏది ఏమైనా ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి కేంద్రంతో పాటు బ్యాంకులు కూడా తమ వంతు సహకారాలను అందిస్తున్నాయి.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరంగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన దేశాన్ని చూడగలము.. పౌరులుగా మనం కూడా కరోనా
వ్యాక్సిన్ను వేయించుకుని మన వంతు బాధ్యతగా మసులుకుందాము..