మనీ : తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభం పొందడం ఎలానో తెలుసా..?

Divya
ప్రస్తుత కాలంలో కరోనా విజృంభించిన తర్వాత, చాలామంది తమ ఆశ్రయాలను కూడా కోల్పోయారు. కొంత మంది నిరాశ్రయులుగా మారారు. లాక్ డౌన్ సమయం లో ఎక్కడికి వెళ్ళలేక, సంపాదించే దారిలేక చాలామంది సతమతమవుతున్నారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు మీ ముందుకు ఒక చిన్న బిజినెస్ ప్లాన్ ను తీసుకొచ్చాము.. అది ఇంటి నుంచి వ్యాపారం చేయాలనుకునే వారికి ఇప్పుడు చెప్పబోయే వ్యాపారం చాలా చక్కగా నడుస్తుంది. తక్కువ పెట్టుబడి తో, ఎటువంటి ఖర్చు లేకుండా ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు.. దాని వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే, బ్రెడ్ తయారీ బిజినెస్ మొదలు పెట్టండి. నెలకు లక్షల్లో సంపాదించే మార్గం మీకు దొరుకుతుంది. ప్రస్తుతం కరోనా వచ్చిన కారణంగా చాలామంది బయట ఫుడ్ తినడానికి మక్కువ చూపడం లేదు. సాధ్యమైనంతవరకు ఇంట్లో తయారు చేసే వంటకాల పైన ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే  హోం నీడ్ ఫుడ్స్ కి డిమాండ్ బాగా పెరుగుతోంది. అందుకే బేకరీ ఫుడ్స్ పై జనాలు ఆసక్తి చూపుతున్నారు. ఇక నిరుద్యోగులు కూడా ఇంటి వద్ద ఉండి కేవలం పది వేల రూపాయల పెట్టుబడితో బ్రెడ్ తయారు చేసి లక్షల్లో లాభాలను పొందవచ్చు.


ముఖ్యంగా బేకరీ ఉత్పత్తులకు మన భారతదేశం ఒక ప్రధాన ఉత్పాదక కేంద్రం. యూఎస్,  చైనా తర్వాత రెండో అతి పెద్ద బిస్కెట్ ఉత్పత్తిచేసే దేశం మన ఇండియానే.. ప్రపంచవ్యాప్తంగా బేకరీ ఫుడ్స్ తయారుచేస్తున్న దేశాలలో మన దేశం మూడవ స్థానంలో ఉంది అని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగాము. గత ఆర్థిక సంవత్సరంలో అసాధారణంగా 17 వేల కోట్ల రూపాయల బిజినెస్ కేవలం ఈ రంగంలోనే నడిచింది. ఇక రాబోయే మూడు, నాలుగు సంవత్సరాలలో 13.15 శాతం వృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


పెరుగుతున్న పట్టణ అభివృద్దీకరణ, నమ్మకమైన ఆహారపదార్థాల వాడకమే ఈ బేకరీ ఉత్పత్తులకు డిమాండ్ పెంచే ప్రధాన కారణాలు. బేకరీ ఉత్పత్తులను తయారు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, మంచి క్వాలిటీ ఉన్న పదార్థాలను మాత్రమే ఉపయోగిస్తారు. అందుకే బ్రెడ్ కు చాలా డిమాండ్ కూడా ఉంది. బ్రెడ్ తయారీ వ్యాపారం వల్ల చాలా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు..


చూశారు కదా..! మీరు కూడా ఈ చిన్నపాటి వ్యాపారాన్ని మీ ఇంట్లో నుండి ప్రారంభించి, మరో పది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరాలని మేము కూడా ఆశిస్తున్నామ్...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: