డబ్బే డబ్బు : టాప్ 3 లోకి భారత్ !

Seetha Sailaja
ప్రపంచాన్ని శాసించే పెద్దన్న పాత్రలో అమెరికా ఆర్ధిక వ్యవస్థ కొనసాగుతున్న వేళ అమెరికాకు గట్టి పోటీ ఇచ్చే శక్తిగా భారత్ ఎదిగి రాబోతున్న 20 ఏళ్ళల్లో ప్రపంచదేశాల ఆర్ధిక వ్యవస్తలలో భారత్ 3వ స్థానానికి చేరుకుంటుంది అంటూ ముకేష్ అంబానీ ఇచ్చిన సందేశం నేటి యువతకు అనేక ఆశలను కలిగిస్తోంది.


ఇలా ముకేష్ అంబాని అంచనాలు వేయడానికి కొన్ని ప్రాతిపదికలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత కుటుంబాలలో 50 శాతం వరకు ఉన్న మధ్యతరగతి కుటుంబాల సంఖ్య ప్రతి ఏటా 4 శాతం చొప్పున పెరుగుతూ మరో 20 సంవత్సరాల తరువాత భారత దేశంలో ఉన్న వ్యాపార రంగాన్ని రాజకీయాలను శాసించే శక్తిగా ఎదుగు తుందని అంబాని అంచనా. అంతేకాదు రాబోతున్న 20 సంవత్సరాలలో భారత యువత దేశాన్ని డిజిటల్ సమాజంగా మార్చి వేస్తుందని అంతేకాకుండా దేశంలోని ప్రజల తలసరి ఆదాయం రెండింతలు అవుతుందని అంబానీ అభిప్రాయం.


అదేవిధంగా కరోనా పరిస్థితులలో కూడ దేశంలోని అన్ని రంగాలు అబివృద్ధి చెందుతున్నాయని సంక్షోబాన్ని కూడ చాల తెలివిగా భారత్ తన పురోగతి బాటగా మార్చుకుందని కరోనా టీకాల విషయంలో కూడ మనదేశం సాధిస్తున్న విజయాలతో ప్రపంచం మన వైపు ఆశ్చర్యంగా చూస్తోంది అంటూ అంబాని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈ కరోనా కాలంలో కూడ భారత్ లోకి విదేశీ పెట్టుబడులు విపరీతంగా వచ్చాయని దానికి ఉదాహరణగా జియో తో ఫేస్ బుక్ చేసుకున్న ఒప్పందమే ఉదాహరణ అని అంటున్నారు.


అంతేకాదు రానున్న రోజులలో దేశంలోని ప్రజల మధ్య ఆర్ధిక అంతరాలు బాగా తగ్గిపోయి అందరికీ విద్యా వైద్య రంగాలలో గొప్ప అవకాశాలు లభించనున్నాయని భారత్ లో జరగనున్న సామాజిక ఆర్ధిక పరివర్తనం దేశ చరిత్రలో నిలిచి పోతుందని అంబాని అభిప్రాయం. అయితే ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అభివృద్ధిని మాత్రమే చూసిన అంబానీ దేశంలో ఇంకా కొనసాగుతున్న పేదరికం గురించి మాట్లాడక పోవడం ఆశ్చర్యకరం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: