డబ్బే డబ్బు : బైడెన్ బీహార్ ల మధ్య కన్ఫ్యూజన్ లో స్టాక్ మార్కెట్ !

Seetha Sailaja
అమెరికా అధ్యక్షుడుగా బైడెన్ గెలవడంతో నిన్న ఇండియన్ స్టాక్ మార్కెట్ శుభారంభం చేసినప్పటికీ మదుపర్లు అతి జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండటంతో స్టాక్ మార్కెట్ నెమ్మదిగా అడుగులు వేస్తోంది. అయితే ఈరోజు తెలియబోతున్న బీహార్ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా అనేకచోట్ల జరిగిన వివిధ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు తెలిసే ఆస్కారం ఉండటంతో ఈ ఫలితాలలో అధికారిక భారతీయ జనతాపార్టీకి వచ్చే స్థానాలను బట్టి ఇండియన్ స్టాక్ మార్కెట్ పరిస్తితి ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు.


ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం బిజెపి కి ఈ ఎన్నికలలో చుక్కెదురైతే మళ్ళీ స్టాక్ మార్కెట్ లో చిన్నపాటి కుదుపు వచ్చే ఆస్కారం ఉంటుంది అని అంటున్నారు. దీనికితోడు దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య అక్టోబర్ నెలకు సంబంధించి సిపిఐ వెల్లడించే ద్రవ్యోల్భణం గణాంకాలు సెప్టెంబర్ నెల పారిశ్రామిక ఉత్పత్తి ఈ గణాంకాలు అన్నీ ఈ వారం స్టాక్ మార్కెట్ ను ప్రభావితం చేసే ఆస్కారం ఉంది.



దీనికితోడు బైడెన్ విజయం సాదిస్తే అమెరికాలో ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించడం మరింత ఆలస్యం అయ్యే ఆస్కారం పరిస్థితులలో డాలర్ విలువ కొద్దిగా ఒడుదుడుకులు లోనవుతుందని అంచనాలు వస్తూ ఉండటంతో ఈవారం షేర్ మార్కెట్ ఊహించినంత ఊపు ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఈ పరిస్థితులు ఇలా ఉండగా జో బైడెన్ అధికారం చేపట్టిన వెంటనే అమెరికాలోని కంపెనీల పై పన్నులు పెంచాలి అన్న ఆలోచన రావడంతో కొన్ని అమెరికా కంపెనీలు తమ ముఖ్య కార్యకలాపాలను ఇండియా వైపు మళ్లిస్తే ఎలా ఉంటుంది అన్న ప్రాధమీక ఆలోచనలు చేస్తున్నట్లు టాక్.


అయితే ఇలా తరలిపోవడానికి ఇండియా చైనా లలో ఏ దేశంలో తమకు అవకాశాలు లాభం ఎక్కువగా ఉంటుంది అన్న ఆలోచనలలో అనేక అమెరికన్ కార్పోరేట్ కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ దీర్ఘకాలికంలో బైడెన్ భారత్ కు లాభమే అంటూ ఇండియాలోని ప్రముఖ పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: