డబ్బే డబ్బు : బంగారం వెండి ధరలను ప్రభావితం చేయబోతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు !

frame డబ్బే డబ్బు : బంగారం వెండి ధరలను ప్రభావితం చేయబోతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు !

Seetha Sailaja
ఈవారం బంగారం వెండి ధరలలో తీవ్ర ఒడుదుడుకులు రాబోతున్నాయని అంచనాలు వస్తున్నాయి. అంతేకాదు ప్రాధమీక లోహాలు అయిన రాగి సీసం అల్యూమినియం ఇందన రంగాలలో కూడ ఈరోజు జరగబోతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల తీవ్రప్రభావం చూపించే ఆస్కారం ఉంది. ఈరోజు జరగబోతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఖర్చు లక్ష కోట్లు పైగా ఉండటం షాకింగ్ న్యూస్ గా మారింది.

గత ఎన్నికల వ్యయంతో పోలిస్తే ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఖర్చు రెట్టింపు అయిందని అంచనాలు తెలియచేస్తున్నాయి. అమెరికాలోని ప్రధాన రాజకీయ పార్టీలు కూడ తమ ఇన్నికల ఖర్చును రెట్టింపు చేయడం కోసం అమెరికాలోని ధనవంతుల దగ్గర నుండి విశేషంగా నిధులు వసూలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను శాసించబోతున్న పరిస్థితులలో గురువారం వెల్లడి అయ్యే ఈ అధ్యక్ష ఎన్నికల ఫలితం గురించి అందరు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.

సాధారణంగా అమెరికన్ ఓటర్లు తాము ఏపార్టీకి మద్దతు ఇస్తున్నాము అన్న విషయం ముందుగానే చెప్పేస్తారు. ప్రస్తుత ప్రాధమిక అంచనాల ప్రకారం బైడెన్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నప్పటికీ చివరి నిముషంలో ఓట్లు వేసే తటస్థ ఓటర్లు ఈ ఎన్నికల ఫలితాన్ని శాసించే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ అమెరికాలో కొనసాగుతున్న పరిస్థితులలో కొన్ని రాష్ట్రాలలో మంగళ వారం ఎన్నిక ముగిసాక కూడ పోష్టల్ ఓట్లను అంగీకరిస్తారు. ఇదే జరిగితే ఓట్ల లెక్కింపు మరింత ఆలస్యం అయ్యే ఆస్కారం కనిపిస్తోంది. తిరిగి అమెరికాలో కరోనా వేవ్ పెరిగిపోతూ ఉండటంతో చాలామంది పోష్టల్ ఓట్లకే మగ్గు చూపించే ఆస్కారం ఉంది. ఇప్పటికే చాలామంది అమెరికన్ లు సుమారు 45 శాతం వరకు పోష్టల్ వేసిన పరిస్థితులలో ఈసారి అగ్రరాజ్యం ఎవర్ని వరిస్తుంది అన్న అంచనాలతో పాటు భారత్ స్టాక్ మార్కెట్ కు సంబంధించి లక్షలాది కోట్ల పెట్టుబడులు బంగారం వెండి లాంటి విలువైన లోహాలు తీవ్ర ఒడుదుడుకులకు లోనయ్యే ఆస్కారం కనిపిస్తోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: