డబ్బే డబ్బు : మూలధన సమీకరణలో వెనకడుగులో ఉన్న ఇండియన్ కంపెనీలు !

Seetha Sailaja
దశాబ్దకాలం క్రితం మన పొరుగు దేశమైన చైనా మార్కెట్ విలువ మనదేసంతో పోల్చి చూసినప్పుడు ఎంతో వెనకడుగులో ఉండేది. అయితే కొన్ని సంవత్సరాల తరువాత ఆపరిస్థితి మారిపోయి ప్రస్తుతం చైనా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో చాలముందు స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం చైనా మార్కెట్ విలువ 10 లక్షల కోట్ల డాలర్లు అయితే మనదేశ మార్కెట్ విలువ 2.11 లక్షల కోట్ల డాలర్లు మాత్రమే అన్న అంచనాలు వస్తున్నాయి.


ఇలా ఇంత వ్యత్యాసం ఏర్పడటానికి గల కారణం మూలధనం సమీకరించడంలో భారతీయ కంపెనీలు చైనా కంపెనీలతో పోటీ పడలేకపోతున్నాయని ఐసీఐసీ సెక్యూరిటీస్ స్ట్రాటజీ హెడ్ వినోద్ కర్కి అభిప్రాయపడుతున్నారు. చైనాలో కరోనా పరిస్థితులు ఏర్పడిన తరువాత అక్కడ కంపెనీలు నిలదొక్కుకోవడానికి అక్కడి ప్రభుత్వం అక్కడి కంపెనీలకు ఎంత మూలధనం కావాలి అంటే అంత మూలధనాన్ని ఇచ్చి ఆడుకున్న విషయాన్ని కర్కి ప్రస్తావిస్తూ అలాంటి పరిస్థితులు మనదేశంలో లేకపోవడం దురదృష్టం అని అభిప్రాయ పడుతున్నారు.


వాస్తవానికి కరోనా పరిస్థితులు కారణంగా భారత్ లోని అనేక చిన్న మధ్య తరహా కంపెనీలు ప్రస్తుత కరోనా పరిస్థితులు వల్ల అనేక సమస్యలలో కూరుకు పోవడంతో వారు చెల్లించవలసిన ఋణాల పై ఇంకా వెసులుబాటు కావాలని వారంతా అడిగినప్పటికీ రుణాలకు సంబంధించి మారటోరియం ను మరింత పొడిగించే శక్తి తమకు లేదనీ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన పరిస్థితులలో భారత్ లోకి అనేక కంపెనీలు వర్కింగ్ క్యాపిటల్ సమస్యలలో చిక్కుకోబోతున్నాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


దీనితో ప్రస్తుత పరిస్థితులలో చిన్నతరహ మధ్య తరహా కంపెనీల నిర్వహణ పెనుసమస్యగా మారింది. ఇటీవల కాలంలో ప్రపంచంలోని పలు దేశాలు చైనా కంపెనీల పై ఆంక్షలు విధిస్తున్న పరిస్థితులలో భారత్ లోని కంపెనీలు అభివృద్ధి పదంలోకి దూసుకు వెళ్ళాలి అంటే ప్రభుత్వ ప్రోత్సాహాలు ముఖ్యంగా రుణాలకు సంబంధించి మారటోరియం ను మరింత పోడిగించాలి అన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాలకంటే త్వరలో రాబోతున్న ఎన్నికల గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు అన్నది నిత్యసత్యం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: