డబ్బే డబ్బు : మనకు ఏది అవసరమో తెలుసుకున్నప్పుడే సంపద !

Seetha Sailaja
ప్రగాఢ వాంఛతో కూడిన ఆలోచన భౌతిక రూపంలోకి మారడానికి ఒక వ్యక్తి చాల కష్టపడాలి. అలా కష్టపడినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి తాను కోరుకున్న సంపదకు సంబంధించిన లక్ష్యాన్ని అందుకోగలుగుతాడు. అయితే ఏవ్యక్తి అయినా తన కోరిక తీరే మార్గం గురించి అన్వేషణ కొనసాగించే పరిస్థితులలో అద్భుతాల గురించి ఆలోచనలు చేస్తే అతడి కోరికలు నెరవేరే పరిస్థితులు ఉండవు.


ముఖ్యంగా డబ్బు సంపాదన విషయంలో ఒక వ్యక్తి ఖచ్చితమైన నిజాయితీతో కూడిన నిర్ణయం తీసుకోగలగాలి అలా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నవారు మాత్రమే వ్యాపార రంగంలో లేదంటే ఉద్యోగ రంగంలో రాణించ గలుగుతారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో త్వరితగతిన ఎదిగిన ఏవ్యక్తి జీవితాన్ని పరిశీలించినా అతడు తన వ్యాపారానికి సంబంధించి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే విజయం సాధించాడని స్పష్టంగా తెలుస్తుంది.


నిర్ణయాలు తీసుకోలేక సందిగ్ధంలో కొనసాగే వ్యక్తి అతడి విద్యలో కాని వ్యాపారంలో కాని ఉద్యోగంలో కానీ కనీసం జీవితంలో కానీ ఎదిగిన సందర్భాలు చాల అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. దీనితో ఒక విషయానికి సంబంధించి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోగల వ్యక్తులు మాత్రమే విజేతలు అవుతారు. ఆర్ధిక స్వేచ్చ సంపద ఈ రెండు అంశాలలోను విజయం సాధించడానికి పట్టుదలతో పాటు స్పష్టమైన నిర్ణయాలు తీసుకోగల శక్తి కూడ ఉండాలి.


ఒక వ్యక్తి జీవితంలో ఎదుగుదల సాధించడానికి పట్టుదల ఎంత అవసరమో స్థిరమైన నిర్ణయం తీసుకోగల శక్తి కూడ అంతవసరం. అందువల్లనే ప్రగాఢ వాంఛను ఆర్ధిక విలువలలోకి మార్చే క్రమంలో మనం తీసుకున్న స్థిర నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి అని అంటారు. వాస్తవానికి అను నిత్యం ప్రతివ్యక్తి మనసు సంపదల వైపు ఆకర్షింప బడుతూ ఉంటుంది. అయితే ఆ ఆకర్షణతో పాటు అంతర్లీనంగా మనకు ఉండే పట్టుదలను నిరంతరం మనం తీసుకున్న స్థిర నిర్ణయాలు ప్రభావితం చేస్తూ ఉండాలి. అందుకే చిరస్మరణీయ నిర్ణయం తీసుకోగల వ్యక్తి మాత్రమే సంపన్నుడు కాగలడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: