డబ్బే డబ్బు : రియల్టీ రంగానికి ప్రవాసుల ఊతం !
వీటి పై వచ్చే ఆదాయాన్ని అద్దెలను ఎటువంటి అనుమతులు లేకుండా తాము ఉంటున్న దేశానికి తమ దేశ కరెన్సీ లో తీసుకు వెళ్ళవచ్చు. ఈ ఆస్థుల కొనుగోలు సమయంలో ఎలాంటి ఆదాయపు పన్ను లేకపోవడం కూడ ప్రవాసులకు బాగా కలిసి వస్తోంది. దీనితో మనదేశంలో ఆస్థుల కొనుగోలుకు ప్రవాస భారతీయులు బాగా ఆశక్తి కనపరుస్తున్నారని సంకేతాలు వస్తున్నాయి.
ముఖ్యంగా 45 సంవత్సరాల లోపు ఎన్ఆర్ఐ లు ఇండియాలోని తమ తల్లి తండ్రుల కోసం అదేవిధంగా బంధువుల కోసం ఆస్థులు కొనుగోలు చేయడానికి ప్రయత్నించే విధంగా విచారణలు పెరిగాయని బిల్డర్లు చెపుతున్నారు. ముఖ్యంగా నగరాలతో పాటు మధ్యతరహా పట్టణాలలో అయినా విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరిగి విల్లాలు లగ్జరీ హౌస్ లు బాగా కొంటున్నారని బిల్డర్లు అభిప్రాయపడుతున్నారు. దీనికి తగ్గట్టుగా బిల్డర్లు కూడ తాము అమ్ముతున్న స్థిరాస్తులకు సంబంధించి ఆకట్టుకునేలా ప్రత్యేకమైన ధరలు వసతులు ఆఫర్ చేయడంతో ప్రస్తుతం లగ్జరీ హౌస్ లు జిల్లాల అమ్మకం మారిన ప్రభుత్వ నిభందనలు వల్ల ఊపు అందుకున్నాయని వార్తలు వస్తున్నాయి.
డాలర్ తో రూపాయి మారకం రేటు మరింత బక్కచిక్కడం వడ్డీ రెట్లు దిగి రావడంతో రియలిటీ రంగానికి మరింత మంచి రోజులు వచ్చాయన్న భావన కూడ కనిపిస్తోంది. కేవలం హైదరాబాద్ బెంగుళూరు లాంటి నగరాలలోనే కాకుండా దక్షణాది రాష్ట్రాలలోని చిన్న పట్టణాలలో కూడ ప్రస్తుతం రియల్టీ రంగానికి మంచిరోజులు రావడం శుభసూచకం..