డబ్బే డబ్బు : షాకింగ్ 15 కనిష్ట స్థాయికి హైరింగ్ సెంటిమెంట్ !
ప్రస్తుతం దేశంలోని కార్పోరేట్ కంపెనీల యాజమాన్యాలు కూడ ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితులలో కేవలం 3శాతం కంపెనీలు మాత్రమే తమ సంస్థలో కొత్త ఉద్యోగాలు తీసుకోవాలని ఆలోచనలు చేస్తున్నాయని మిగతా 97శాతం కంపెనీలు తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను ఎలా తగ్గించాలి అన్న ఆలోచనలు చేస్తున్నాయని ఈ సర్వే వెల్లడించింది. అయితే బడా మధ్య స్థాయి కంపెనీలతో పోలిస్తే చిన్నచిన్న సంస్థలలో హైరింగ్ సెంటిమెంట్ బాగుందని కానీ ఈ చిన్న సంస్థలు తమ సంస్థలలో చేరే వారికి ఎంత ప్రతిభ ఉన్నా తక్కువ జీతాలు ఇస్తున్న విషయాన్ని ఆ నివేదిక బయట పెట్టింది.
అదేవిధంగా చాల కంపెనీలు తమ సంస్థలలో పని చేస్తూ తాత్కాలిక సెలవుల పై బయటకు పంపించిన తమ ఉద్యోగులను ఇదేరకమైన సెలవును మరో కొంత కాలం కొనసాగించమని చెపుతున్న పరిస్థితులలో వీరందరికీ తిరిగి ఆ సంస్థల నుండి తాము చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పిలుపు వస్తుందా రాదా అన్న విషయం క్లారిటీ లేదు అంటూ ఆ నివేదిక తెలియచేసింది.
ప్రస్తుత కరోనా సంక్షోభంలో భారతదేశంలోని చాల కుటుంబాలు ఆర్ధికంగా బలహీన పడ్డాయని ప్రస్తుతం అనేక కుటుంబాలు తమ వద్ద ఉన్న డబ్బుతో మూడు నెలలకు మించి అవసరాలు తీర్చుకునే పరిస్థితులలో లేరనీ దీని ప్రభావం ఎక్కువగా భారత్ లోని 24-30 సంవత్సరాల యువ కుటుంబాల పై అధిక ప్రభావం చూపెడుతూ ఉండటంతో కుటుంబ అశాంతితో ఆత్మహత్యలు పెరిగిపోతున్న విషయాన్ని ఈ నివేదిక వెల్లడించింది..