డబ్బే డబ్బు : కరోనా ఫుడ్ తో డబ్బే డబ్బు !
కరోనా పరిస్థితులు మొదలైన తరువాత మనుషుల ఆలోచనలలో అనేక మార్పులు రావడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలు ప్రజల జీవన శైలి అభిరుచులు ఆలోచనలు ఇలా ఎన్నోమార్పులు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో హోటల్ ఇండస్ట్రీకి ఇక భవిష్యత్ ఉండదా అని అందరు కలవర పడుతున్న పరిస్థితులలో తమిళనాడులోని మధురై నగరంలో ఒక ప్రముఖ హోటల్ తమ ఫుడ్ మెనూ లో చేసిన మార్పులు ఆ హోటల్ కు విపరీతమైన బిజినెస్ తెచ్చి పెట్టడమే కాకుండా ఇప్పుడు ఆ హోటల్ అనుసరిస్తున్న వ్యాపార సూత్రాలను అనేక ప్రముఖ హోటల్స్ అనుసరించడానికి ప్రయత్నించడం సంచలన వార్తగా మారింది.
దీనితో రానున్న రోజులలో కరోనా వంటల యుగం ప్రారంభం అవుతుందా అంటూ చాలామంది ఆశ్చర్య పడుతున్నారు. మధురై నగరం పరోటాలకు ఫేమస్ రకరకాల టెస్ట్ లతో రోడ్డు సైడ్ హోటల్స్ నుండి స్టార్ హోటల్స్ వరకు అక్కడ వెరైటీ పరోటాలను చేయడం ఎప్పటి నుంచో కొనసాగుతున్న సంస్క్రతి.
అయితే ప్రస్తుతం కరోనా భయాలు పెరిగిపోయి జనం హోటల్స్ కు రావడం తగ్గించి వేసిన పరిస్థితులలో ఒక ప్రముఖ త్రీ స్టార్ హోటల్ తమ హోటల్ కు సంబంధించిన మెనూ లో మార్పులు చేసి కరోనా మాస్క్ లు కరోనా బొండాలు కరోనా రవ్వదోస కరోనా బర్గర్ కరోనా కప్ కేకులు ప్రవేశ పెట్టడంతో ఇప్పుడు ఆ ఫుడ్స్ కు డిమాండ్ పెరిగి ఆ ఫుడ్స్ తినడానికి హోటల్స్ కు విపరీతంగా జనం వస్తున్నారు. అంతేకాదు కరోనా మెనూ పేరుతో ఒక యాప్ ను క్రియేట్ చేసి ఆస్టార్ హోటల్ మధురై ప్రాంతంలో ఇప్పుడు హోమ్ డెలవరీలు చేస్తూ ఈ కరోనా సమయంలో కూడ తమ బిజినెస్ ను విపరీతంగా పెంచుకున్నారు.
ఇప్పుడు ఈ విషయాలు అన్ని ప్రముఖ హోటల్స్ కు తెలిసిపోవడంతో దక్షిణాది ప్రాంతంలోని అనేక ప్రముఖ హోటల్ ఇలా వెరైటీ ఫుడ్స్ ను తయారు చేస్తూ ‘ఈ మాస్క్ తినండి మా మాట విని మాస్క్ పెట్టుకోండి’ అన్న స్లోగన్ తో వేల సంఖ్యలో తమ ఖాతాదారులను పెంచుకుంటున్నాయి..