డబ్బే డబ్బు : పనే పరమౌషదం !

frame డబ్బే డబ్బు : పనే పరమౌషదం !

Seetha Sailaja

ఏకాగ్రతతో మనం చేసే పనిని దైవంగా మాత్రమే కాకుండా ఒక పరమ ఔషదం గా భావించిన వారు మాత్రమే జీవితంలో సంపదను పొందగలరు. బాధలను మర్చిపోవడానికి ఒత్తిడిని జయించడానికి ఆనందంగా ఉండటానికి పనిని మించిన మరొక పరమౌషదం లేదని అనేక అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. ఈమధ్య చేసిన ఒక సర్వేలో ఇళ్ళల్లో ఎక్కువగా తీరిక సమయంతో కాలం గడుపుతున్న వ్యక్తులకన్నా అనుక్షణం బిజీగా ఉంటూ కాలం గడిపే వారు ఆనందంగా ఉండటమే కాకుండా వారికి అనారోగ్యాలు తక్కువగా వస్తున్నాయని ఆ అధ్యయనం తెలియచేసింది.


ఏపనీ పాట లేకుండా ఖాళీగా ఉండే వ్యక్తులకు నిరాశ నిస్పృహలు పెరిగిపోయి తమకు లేని అనారోగ్యాన్ని ఊహించుకుంటూ డాక్టర్స్ చుట్టూ తిరిగే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని ఈ అధ్యయనం అనేక ఆసక్తికర విషయాలను తేలియాచేసింది. దీనితో ప్రతి వ్యక్తి తనకు చేతనైన ఎదో ఒక పనిచేస్తూ రోజులో ఎక్కువ సమయం పనిలో నిమగ్నమైతే ఎటువంటి అనారోగ్యాలు ఆవ్యక్తి దరిచేరవు అన్నవిషయం వైద్యులు కూడ అంగీకరిస్తున్నారు.


అయితే ఒక వ్యక్తి ఒక పని చేస్తూ నిరంతరం బిజీగా ఉండాలి అంటే ఆవ్యక్తి తాను చేసే పనిని నిరంతరం ప్రేమించగలగాలి. ఇలాంటి మనస్తత్వం జపాన్ చైనా లాంటి దేశాలలోని ప్రజలలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ దేశాలు కేవలం రెండు దశాభ్దాలలో ప్రముఖ ఆర్ధిక శక్తులుగా ఎదిగి ఏకంగా అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసే స్థితికి చేరుకున్నాయి. 


ఎప్పుడు పనితో బిజీగా ఉండే వ్యక్తిని ఒక ఆరు నెలలపాటు ఖాళీగా కూర్చో పెడితే అతడిలో సంపాదనపై ఆసక్తి నశించి ఒక మానశిక రోగిగా మారే ప్రమాదం ఉందని మానసిక వైద్యులు హెచ్చరికలు చేస్తున్నారు. చాలామంది డబ్బున్న వారి పై చాల నెగిటివ్ అభిప్రాయాలతో ఉంటారు. అయితే వారు ఎంచుకున్న పనిలో అనుక్షణం బిజీగా ఉంటూ కాలం గడపడం వలన మాత్రమే వారికి ఆస్థాయిలో సంపదలు వచ్చాయి అన్నవిషయాన్ని గ్రహించ గలిగితే ఏవ్యక్తి అయినా పనిని పరమౌషదంగా భావించి శ్రమించి ఐశ్వర్య వంతుడు అవుతాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: