భారతీయుడు-2 చిత్రంలో విలన్ అతనేనా..?

Divya
చివరిగా నటుడు కమలహాసన్ విక్రమ్ సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఎన్నో ఫ్లాపుల తర్వాత ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం కావడంతో అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు... ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ పైనే నిర్మించారు కమలహాసన్. ఈ సినిమాతో కొన్ని కోట్ల రూపాయల లాభాన్ని కూడా అందుకోవడం జరిగింది. దీంతో తన బ్యానర్ పైనే ఇతర హీరోలతో సైతం పలు చిత్రాలను తెరకెక్కిస్తే ఉన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు-2 సినిమా సీక్వెల్ ని తెరకెక్కించే పనిలో పడ్డారు.
ఇందులో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా కీలకమైన పాత్రలో రకుల్ ప్రీతిసింగ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.అలాగే మరొక నటుడు సిద్ధార్డ్ కూడా నటిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కోలీవుడ్ నటుడు ఎస్ జె సూర్య ఇండియన్-2 చిత్రంలో విలన్ గా నటించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం అధికారికంగా చిత్ర బృందం ప్రకటించలేదు కానీ కోలీవుడ్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ చిత్రంలో కూడా ఒక భాగమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.

భారతీయుడు -2 విషయంపై చిత్ర బృందం కానీ ఎస్ జె సూర్య కానీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. అలాగే ప్రియా భవాని శంకర్ బాబీ సింహా తదితరులు సైతం ముఖ్యమైన పాత్రల నటిస్తూ ఉన్నారు. సింగర్ అనిరుద్ రవిచంద్ర ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు లేక ప్రొడక్షన్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అవ్వాల్సి ఉండగా ఎన్నోసార్లు సినిమా షూటింగ్ వాయిదా వేయవలసి వచ్చింది. ఈ ఏడాది ఈ సినిమా విడుదల చేసేందుకు పలు సమ్మహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: