బాలయ్య బర్త్డే కి స్పెషల్ అప్డేట్ తో రాబోతున్న టీం....!!

murali krishna
ఇటీవల 'అఖండ', 'వీరసింహారెడ్డి' బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత నందమూరి నటసింహం, సీనియర్ నటుడు బాలకృష్ణ  నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'ఎన్బీకే108'.యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నవిషయం తెలిసిందే. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. గతంలో విడుదలైన ప్రీలుక్ కు ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. బాలయ్య మాస్ లుక్ కు, మునుపెన్నడూ లేని గెటప్ కు అభిమానులు మాత్రం ఫిదా అవుతున్నారు.
అయితే, జూన్ 10న నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు ఉన్న సందర్భంగా చిత్రం నుంచి వరుసగా అప్డేట్స్ ఇచ్చేందుకు యూనిట్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈసారి బర్త్ డే వేడుకులను గ్రాండ్ గా నిర్వహించేందుకు ఫ్యాన్స్ సిద్ధమవుతుండగా.. ఇటు NBK108 చిత్ర యూనిట్ కూడా అభిమానులకు సర్ ప్రైజ్ ల మీద సర్ ప్రైజ్ లు ఇవ్వబోతోంది. బాలయ్య పుట్టినరోజుకు రెండ్రోజుల ముందు 'ఎన్బీకే108' టైటిల్ ను రిలీజ్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
రీసెంట్ గా బాలయ్య 'భగవంత్ లాల్ కేసరి' పాత్రలో నటించబోతున్నట్టు టాక్ వినిపించింది. పాత్రకు తగ్గట్టుగానే బాలయ్య లుక్ కూడా టెర్రిఫిక్ గా ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రం టైటిల్ ను విష్ణుమూర్తిని గుర్తుచేసేలా ఉండబోతుందని అంటున్నారు. ఈ మేరకే టైటిల్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో టైటిల్ విడుదల కానుండటం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.
మరోవైపు టైటిల్ తో పాటు చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీ లుక్ పోస్టర్లు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిసిందే. ఇక ఫస్ట్ లుక్ మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందంటున్నారు. అలాగే బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా యూనిట్ మరో ట్రీట్ ను కూడా ఇవ్వబోతుందని సమాచారం. ఆరోజు మరేదైనా పవర్ గ్లింప్స్ వదిలే అవకాశం ఉందేమోనని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇక ఎప్పుడూ బాలయ్య రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సినిమాల్లో నటిస్తూ వచ్చేవారు. ఈసారి మాత్రం తెలంగాణలో దింగుతుండని అనిల్ రావిపూడి వెల్లడించిన విషయం తెలిసిందే. తెలంగాణ యాస, భాషలో పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. మొత్తానికి చిత్రం అప్డేట్స్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. బాలయ్య సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. కూతురి పాత్రలో శ్రీలీలా అలరించనుంది. శ్రీముఖి కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కించబోతున్న చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: