బికినీ లో స్కిన్ షో చేస్తున్న రకుల్....!!

murali krishna
రకుల్ ప్రీత్ సింగ్ సమ్మర్ వెకేషన్ లో ఉన్నారు. ఆమె మాల్దీవ్స్ వెళ్లారు. అందమైన సాగర తీరంలో టూ పీస్ బికినీ వేసి స్కిన్ షో చేస్తుంది.ఉరుకురుల పరుగుల జీవితంలో కొంత ఉపశమనం కావాలి. స్టార్ లేడీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రశాంతత కోసం మాల్దీవ్స్ చెక్కేసింది.  చల్లని సాగరతీరంలో సేదతీరింది. యల్లో కలర్ బికినీలో పరువాల ప్రదర్శన చేసింది. రకుల్ ప్రీత్ బోల్డ్ ట్రీట్ హాట్ టాపిక్ అవుతుంది.
హీరోయిన్ రకుల్ ప్రీత్ ఫిట్నెస్ ఫ్రీక్. ఈ జీరో సైజ్ భామ కఠిన వ్యాయామం చేసి ఫిట్ అండ్ స్లిమ్ బాడీ మైంటైన్ చేస్తుంది. మరి కష్టపడి సాధించిన పరువాలు దాచుకుంటే ఏం లాభం... అందుకే సోషల్ మీడియా వేదికగా ప్రదర్శనకు పెడుతుంది. ట్రెండీ వేర్లో రకుల్ సూపర్ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి.2023లో ఛత్రీవాలి మూవీతో హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలో రకుల్ కండోమ్ టెస్టర్ గా నటించడం విశేషం. ప్రస్తుతం రకుల్ మేరీ పత్నికా రీమేక్ అనే చిత్రంలో నటిస్తున్నారు. రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న బడా ప్రాజెక్ట్ భారతీయుడు 2. వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 ఇటీవల తిరిగి పట్టాలెక్కింది. ఆ మూవీలో కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.

మరోవైపు పెళ్లి వార్తలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు. 2021లో రకుల్ నటుడు నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు వెల్లడించారు. బిజీ షెడ్యూల్స్ నేపథ్యంలో గత ఏడాది వీరు వివాహం చేసుకోలేదు. ఈ ఏడాది ఏడడుగులు వేయడం ఖాయం అంటున్నారు. రకుల్ మాత్రం ఇంకా సమయం ఉందంటున్నారు. దీంతో రకుల్-జాకీ పెళ్లి చేసుకుంటారా లేక ఎవరి దారి వారు చూసుకుంటారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
ఇక టాలీవుడ్ ప్రేక్షకులు ఆమెను బాగా మిస్ అవుతున్నారు. ఆమె నటించిన తెలుగు చిత్రాలు వరుసగా పరాజయం పొందాయి. దీంతో టాలీవుడ్ మేకర్స్ ఆమెను పక్కన పెట్టేశారు. రకుల్ నటించిన చెక్, కొండపొలం చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. .బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన రకుల్ టాలీవుడ్ ని నిర్లక్ష్యం చేయడం కూడా ఒక కారణం. పవన్, ప్రభాస్ లను మినహాయిస్తే ఈ తరం టాప్ స్టార్స్ అందరితో రకుల్ నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: