"ఖుషి" మూవీ ఫస్ట్ సింగిల్ కి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ప్రేమ కథలను వెండి తెరపై అద్భుతంగా తెరకెక్కిస్తాడు అని పేరు కలిగినటువంటి శివా నిర్వాన దర్శకత్వం వహిస్తూ ఉండగా ... తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి సమంత ఈ మూవీ లో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకు వీరిద్దరూ కలిసి మహానటి సినిమాలో నటించారు. వీరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.
 

ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా ఒకే తేదీన విడుదల చేయనునట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుండి "నా రోజా నువ్వే" అంటూ సాగే మొదటి పాటను ఈ మూవీ బృందం విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ పాటకు విడుదల అయిన కొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సాంగ్ 40 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇలా ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన మొదటి పాటే అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ తదుపరి పాటలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: