తల్లి బాటలోనే పయనిస్తున్న బ్రహ్మానందం చిన్న కోడలు....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎన్నో వందల సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు బ్రహ్మానందం.
తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ పాత్రలలో నటిస్తూ తన అద్భుతమైన కామెడీ టైమింగ్ పంచ్ డైలాగులతో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బ్రహ్మానందం ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరమయ్యారని చెప్పాలి.
కేవలం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు.ఇక బ్రహ్మానందం వృత్తి పరమైన జీవితం పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈయనకు ఇద్దరు అబ్బాయిలు అనే విషయం మనకు తెల్సిందే.
వీరి పెద్ద కుమారుడు గౌతమ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటించారు.అయితే ఈయన పెద్దగా ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి.ఇక చిన్న కుమారుడు సిద్ధార్థ్  ఈయన విదేశాలలో స్థిరపడ్డారు.
అయితే గత కొద్ది రోజుల క్రితం బ్రహ్మానందం తన చిన్న కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్థం ఎంతో అంగరంగ వైభవంగా జరిపించిన విషయం మనకు తెలిసిందే. సిద్ధార్థ్ ఐశ్వర్య అనే అమ్మాయితో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.
త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలుఎక్కబోతున్నారు.వీరిద్దరిది పెద్దలు కుదుర్చున వివాహం.ఇలా బ్రహ్మానందం చిన్న కుమారుడి పెళ్లి జరుగుతున్న నేపథ్యం లో తనకు కాబోయే కోడలు బ్యాగ్రౌండ్ ఏంటి అని అందరూ ఆరా తీస్తున్నారు.అయితే బ్రహ్మానందం చిన్న కోడలు ఐశ్వర్య ప్రముఖ డాక్టర్ అని తెలుస్తుంది.ఈమె కరీంనగర్ లోని పద్మజ సంతాన సాఫల్య కేంద్రం యజమాని డాక్టర్‌ పద్మజ-వినయ్ దంపంతుల ఒక్కగానొక్క కుమార్తె.
తన తల్లి డాక్టర్ కావడంతో ఐశ్వర్య సైతం తన తల్లి బాటలో నే పయనిస్తూ వైద్య వృత్తిని అభ్యసించారు.గైనకాలజీ, ఫర్టిలిటీలో స్పెషలైజేషన్ చేసింది.కుందనపు బొమ్మలా ఉండే ఐశ్వర్య పేరిట ఇప్పటికే ఆమె తల్లిదండ్రులు కొన్ని కోట్ల ఆస్తుల ను కూడబెట్టారనీ ఈమె పేరిట భారీగా నే ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది.
ఏది ఏమైనా బ్రహ్మానందం చిన్న కోడలు బ్యాగ్రౌండ్ భారీగానే ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: