ప్రెగ్నెన్సీ లోకూడా రొమాంటిక్ యాంగిల్ లో ఇలియానా....!!

murali krishna
టాలీవుడ్‌లో ఇలియానా ఎంట్రీనే ఒక సెన్సేషన్. ‘దేవదాసు’, ‘పోకిరి’ సినిమాలతో ఊహించని క్రేజ్ సంపాదించిన హీరోయిన్ . కొన్నేళ్ల పాటు అదే జోరు కొనసాగించింది. కానీ సడెన్‌గా టాలీవుడ్‌ను వదిలి బాలీవుడ్‌కు చెక్కేసిన ఈ నడుము సుందరికి అక్కడ చుక్కెదురైంది. అనుకున్న మేర అవకాశాలు రాకపోవడంతో ఫేడవుట్ అయిపోయిన గోవా బ్యూటీ అర కొర అవకాశాలతో కెరీర్‌ను నెట్టుకొస్తోంది. ఇదిలా ఉంటే, తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఏప్రిల్‌లో ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది ఇల్లీ బేబీ. ఈ వార్త నెట్టింట సెన్సేషన్‌గా మారగా.. అప్పటి నుంచి తరచూ తన బేబీ బంప్ ఫొటోలు పోస్టు చేస్తూ అప్‌డేట్ ఇస్తోంది. ఇదే క్రమంలో తాజాగా తన బేబీమూన్‌‌ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ షేర్ చేసుకోగా.. అందులో తన మిస్టరీ బాయ్‌ఫ్రెండ్ కనిపించడం విశేషం.
ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తను బేబీమూన్  ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు షేర్ చేసింది. ఫస్ట్ పిక్చర్‌లో బ్యూటిఫుల్ బీచ్ లొకేషన్‌ను చూపింగా.. రెండో ఫొటోగా డ్రింక్ గ్లాస్‌ను షేర్ చేసింది. ఇక మూడో చిత్రంలో తను ప్రియుడి చేతిలో చెయ్యేసి ఉంచడాన్ని చూడవచ్చు. జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఇద్దరు కూడా తమ రింగ్ ఫింగర్స్‌కు ఉంగరాలు ధరిచంచి ఉండటం చూడచ్చు. ఇది ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు సూచిస్తుండగా.. ‘నా శృంగార ఆలోచన తనను ప్రశాంతంగా తిననివ్వదు’ అంటూ క్యాప్షన్ కూడా యాడ్ చేసింది. కాగా.. ప్రెగ్నెన్సీ ప్రకటన తర్వాత ఇలియానా తన బాయ్‌ఫ్రెండ్ ఫొటోను షేర్ చేయడం ఇదే తొలిసారి. అయితే, ఇందులో ప్రియుడి చెయ్యి మాత్రమే కనిపించగా.. ఇంతకీ తను ఎవరనే  ఊహాగానాలకు సమాధానం దొరకలేదు.
ఇక ఇలియానా ప్రెగ్నెన్సీ ప్రకటన విషయానికొస్తే.. ‘Coming Soon.. నిన్ను కలవడానికి వెయిట్ చేయలేను నా లిటిల్ డార్లింగ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఇండస్ట్రీ సహచరులతో పాటు అభిమానులు ఆమెపై ప్రేమను కురిపిస్తూ కామెంట్లు చేశారు. అయితే, ప్రెగ్నెన్సీ ప్రకటించినప్పటికీ.. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని మాత్రం ఆమె ఇంతవరకు రివీల్ చేయలేదు. మరోవైపు కొంతకాలంగా ఇలియానా.. కత్రినా కైఫ్ సోదరుడితో చెట్టపట్టాల్ వేసుకుని తిరిగిన సంగతి తెలిసిందే. తనే ఇలియానా బిడ్డకు తండ్రని నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే తెలుగులో ఇలియానా నటించిన చివరి చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోని’. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఇక హిందీలో ఇలియానా నటించిన ‘అన్ ఫెయిర్ అండ్ లవ్‌లీ’ అక్టోబర్‌లో విడుదల కానుంది. ఇది కాకుండా విద్యాబాలన్, ప్రతీక్ గాంధీతో కలిసి నటించిన అన్‌టైటిల్డ్ ఫిల్మ్ కూడా రిలీజ్ కావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: