జయం సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్ ను వదులుకున్న ఆ స్టార్ హీరో..!!

murali krishna
ప్రేమ కథలలో సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన సినిమా 'జయం'.తేజ దర్శకత్వం లో నితిన్ హీరో గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.
ఆ చిత్రం లోని పాటలు ఇప్పటికీ కూడా చాలా ఫేమస్. ఈ సినిమాలోని పాట లోని చిన్న బిట్ 'రాను రాను అంటూనే చిన్నడోయ్' అని మాచెర్ల నియోజకవర్గం లో పెట్టినందుకు ఆ చిత్రం పై బజ్ ఒక్కసారిగా అయితే పెరిగిపోయింది. ఈ చిత్రం లోని పాటలకు అంత క్రేజ్ అయితే ఉంటుంది.ఈ సినిమా విడుదల అయినా మొదటి వారం మొత్తం నెగటివ్ టాక్ వచ్చింది .కానీ చిన్నగా టాక్ ఇంప్రూవ్ అవుతూ రెండవ వారం నుండి సునామి లాంటి వసూళ్లు వచ్చాయని చెప్తుంటారు ట్రేడ్ పండితులు. ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టించింది.అప్పటి వరకు ఆ ప్రాంతం లో ఆల్ టైం రికార్డు గా కొనసాగిన పవన్ కళ్యాణ్ 'ఖుషి' రికార్డు ని కూడా బద్దలు కొట్టిన సినిమా ఇది.
ఈ చిత్రం వసూళ్లను నైజాం ప్రాంతం లో అందుకోవడానికి కొంత మంది స్టార్ హీరోలకు సుమారు పదేళ్లు పట్టిందని తెలుస్తుంది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 16 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు సాధించి ఉంటుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.అయితే ఈ సినిమాలో హీరో నితిన్ కంటే కూడా ఎక్కువగా విలన్ గా నటించిన గోపీచంద్ కి ఎక్కువ పేరు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో ఆయన చూపించిన నట విశ్వరూపం అలా ఉంటుంది.. ఒక విలన్ కి ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా ఏర్పడడం అనేది కేవలం గోపీచంద్ విషయం లోనే జరిగింది. అయితే ఈ సినిమాలో హీరో మరియు విలన్ పాత్రలను ముందుగా నితిన్ మరియు గోపీచంద్ ని అనుకోలేదట డైరెక్టర్ తేజ. ఆయన దృష్టిలో ఈ పాత్రలకు గాను ఇద్దరు హీరోలను మైండ్ లో ఉంచుకున్నాని సమాచారం.. ఆ హీరోలు మరెవరో కాదు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు అల్లరి నరేష్. అల్లు అర్జున్ ని హీరో గా పరిచయం చేస్తూ, అలాగే అల్లరి నరేష్ ని కూడా ఈ సినిమా ద్వారానే విలన్ గా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఆయన అనుకున్నాడని సమాచారం.. కానీ వాళ్ళిద్దరికీ ఈ సినిమా కథ అస్సలు నచ్చలేదు. దీనితో అగ్ర నిర్మాతగా ఇండస్ట్రీ లో కొనసాగుతున్న సుధాకర్ రెడ్డి తన కొడుకు నితిన్ ని ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం చేసే ప్రయత్నంలో ఎన్నో కథలను అయితే విన్నాడు. అందులో ఆయనకీ జయం కథ చాలా బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేసాడు. ఇక ఈ చిత్రం లో కీలకమైన విలన్ పాత్ర కోసం ప్రకాష్ రాజ్ ని అనుకున్నారని సమాచారం.. ఆ సమయం లో ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడం తో, ఎప్పటి నుండో తేజ తో టచ్ లో ఉంటూ అవకాశం కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ కి ఆ అవకాశం దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: