మళ్ళీ పెళ్లిని పక్కకి తోసేసిన మేం ఫేమస్, 2018?

Purushottham Vinay
గత వారం శుక్రవారం రోజున పలు ఆసక్తికరమైన సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా వాటిలో ప్రేక్షకులలో ఆసక్తి కలిగించిన సినిమాలు అయితే మూడే ఉన్నాయి.వాటిలో ఒకటి మలయాళ డబ్బింగ్ 2018 మూవీ. ఇంకా మరొకటి యూత్లో మంచి క్రేజ్ ఏర్పరచుకున్న మేం ఫేమస్ సినిమా. ఇక మరొక సినిమా విషయానికి వస్తే నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమా.2018 సినిమాని మలయాళంలో కేవలం 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా ఆ సినిమాని మలయాళ ప్రేక్షకులందరూ నెత్తిన పెట్టుకున్నారు. ఆ సినిమాని విపరీతంగా ఓన్ చేసుకున్న నేపథ్యంలో దాదాపు 150 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టి కేరళలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మలయాళ సినిమాగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇక ఈ బ్లాక్ బస్టర్ సినిమాని తెలుగులో బన్నీ వాసు రిలీజ్ చేశారు. గీత ఆర్ట్స్ ప్రమేయం లేకుండా సొంత డబ్బు ఖర్చు పెట్టి మరి ఈ సినిమా రిలీజ్ చేయగా ఆయనకు మంచి లాభాలు వచ్చాయి. ఈ సినిమా మొదటి వీకెండ్ లో ఏకంగా నాలుగున్నర కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.


కేవలం మూడే మూడు రోజుల్లో ఈ పరభాష సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడమే కాకుండా మంచి లాభాలని తీసుకోచ్చింది. అలాగే మొత్తం కొత్త వారే కలిసి నటించిన మేం ఫేమస్ సినిమా కూడా ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి రేకెత్తించింది. నిజానికి ఈ సినిమాలో హీరోగా నటిస్తూనే సుమంత్ ప్రభాస్ అనే కొత్త కుర్రాడు సినిమాని డైరెక్ట్ చేశాడు. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ సంస్థ తక్కువ ఖర్చులోనే నిర్మించిన ఈ సినిమా కూడా దాదాపు మూడున్నర కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి మంచి లాభాలతో హిట్గా నిలిచింది.పైగా ఈ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ సపోర్ట్ ఉండటం ఈ సినిమాకి కలిసి వచ్చే అంశం.ఇక అలాగే మరో పక్క నరేష్ పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమా కాంట్రవర్సీల విషయంలో మాత్రం బాగా ముందు ఉన్నా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఏ మాత్రం జోరు చూపించడం లేదు. ఆ సినిమా మొదటి వీకెండ్ లో కేవలం జీరో షేర్ రాబట్టడం షాక్ ఇచ్చే విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: