తన కేరిర్ లో జరిగిన షాకింగ్ అనుభవాలు గూర్చి చెప్పిన డైరెక్టర్.....!!

murali krishna
టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన తేజ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. తన కెరీర్ లో ఎదురైన కష్టాలు, షాకింగ్ అనుభవాల గురించి ఆయన వెల్లడించారు.

మాది చెన్నై అని నాకు ఒక అక్క, చెల్లి అని తేజ అన్నారు. చిన్నప్పుడు మాకు ఆస్తులు బాగా ఉండేవని నాకు ఊహ తెలిసే సమయానికి అమ్మ చనిపోయారని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. అమ్మ చనిపోవడంతో నాన్న అనారోగ్యానికి గురై కొంతకాలానికే కన్ను మూశారని తేజ వెల్లడించారు.

అందువల్ల పరిస్థితులు మారిపోయి బంధువులు మమ్మల్ని పంచుకున్నారని తేజ వెల్లడించారు. అక్క, నేను, చెల్లి ఒక్కొక్కరం ఒక్కో చోట పెరిగామని ఆయన కామెంట్లు చేశారు. మమ్మల్ని పెంచడం కోసం బంధువులు కొన్ని ఆస్తులు తీసుకోవడం జరిగిందని తేజ చెప్పుకొచ్చారు. బంధువులు ఒకరోజు ఆరుబయట పడుకోవాలని చెప్పగా ఇంటి ఉంచి పారిపోయానని తేజ కామెంట్లు చేయడం గమనార్హం. 

సినిమాల వల్లే నేను ఈ స్థాయికి రావడం సాధ్యమైందని ఆయన కామెంట్లు చేశారు. నిజం మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడం తో సినిమాల విషయంలో ఏకాగ్రత కోల్పోయానని తేజ వెల్లడించారు. ఆ తర్వాత మా అబ్బాయి అనారోగ్య సమస్యలతో బాధ పడ్డాడని తేజ చెప్పుకొచ్చారు. అబ్బాయి అనారోగ్య సమస్యల వల్ల నాలుగు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్నానని ఆయన కామెంట్లు చేశారు.

సమస్యలు మళ్లీ మొదలయ్యాయని నేనే రాజు నేనే మంత్రి సినిమా తో మళ్లీ సక్సెస్ ను సొంతం చేసుకున్నానని తేజ చెప్పుకొచ్చారు. తేజ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. తేజ మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుం టున్నారు. అహింస సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుం దో లేదో చూడాల్సి ఉంది. దగ్గుబాటి అభిరామ్ ఈ సినిమాలో హీరోగా నటించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: