60 ఏళ్ల వయసులో పెళ్లికొడుకైన తెలుగు విలన్..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో విలన్ గా నటించి పలు క్యారెక్టర్ ఆర్టిస్టులలో నటించి మెప్పించిన నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన పేరు గుర్తుపట్టకపోవచ్చు.. కానీ ఈయన ఫోటో చూస్తే అందరికీ సుపరిచితమే.. ముఖ్యంగా పోకిరి సినిమాలో ఇలియానని వేధించే ఒక శాడిస్ట్ పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. ఆ తర్వాత తెలుగులో ఎన్నో విభిన్నమైన పాత్రలలో ఆశిష్ విద్యార్థి భారతీయ భాషలన్నిటిలో కూడా నటించే  స్టార్ నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న ఈ నటుడు ఈ వయసులో వివాహం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

చివరిగా సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ సినిమాల నటించారు. ఇందులో పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి అందరిని మెప్పించారు. ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గుతూ ఉండడంతో ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా ఏర్పాటు చేసుకొని దేశం మొత్తం తిరుగుతూ పలు రకాల వీడియోలను షేర్ చేస్తూ మిలియన్లు ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు ఆశిష్ విద్యార్థి.. యూట్యూబ్ ఛానల్ కి మంచి డిమాండ్ ఉండడం చేత తాజాగా 60 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నటువంటి ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.

తన ప్రియురాలు అస్సాం కి చెందిన రూపాలి బరోవాని వివాహం చేసుకున్నారు. అతి కొద్ది సమాజంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే ఆశిష్ విద్యార్థి 20 ఏళ్ల క్రితం బెంగాలీ నటి రాజేష్ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నారు కానీ కొన్నేళ్ల క్రితం విభేదాలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి.. రూపాలితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారి ఈ రోజున వివాహం చేసుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: