కార్తీ: రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోనే?

Purushottham Vinay
జనాలని మెప్పించే సహజమైన నటనతో వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకుంటూ ముందుకుసాగుతున్న హీరోల్లో ఖచ్చితంగా కార్తి ముందు వరసలో ఉంటాడు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ప్రతి హీరో ఫ్యాన్ కూడా కార్తిని ఎంతో ఇష్టపడతారు. నేడు కార్తీ పుట్టినరోజు. ఇక 1977 మే 25న మద్రాస్‌లో జన్మించారు కార్తి. కార్తి తండ్రి శివకుమార్ కూడా నటుడే. ఇక కార్తి అన్న సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి కంటెంట్ సినిమాలతో కోలీవుడ్ ఇంకా టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కార్తి. మొదటి సినిమా పరుత్తివీరన్ తోనే ప్రేక్షకులను మెప్పించి అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత సెల్వరాఘవన్ దర్శకత్వంలో చేసిన యుగానికి ఒక్కడు సినిమాతో ఇంకా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలోని 'ఎవర్రా మీరంతా..'అనే డైలాగ్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది.అవుతుంది కూడా..


ఇక ఆవార, నాపేరు శివ లాంటి సినిమాలతో స్టార్ హీరోగా మారి మంచి గుర్తింపు తెచ్చుకోగా 2019లో వచ్చిన ఖైదీ సినిమాతో అయితే మరింత పాపులర్ అయ్యారు. ఆ తర్వాత సుల్తాన్‌తో ప్రేక్షకులను మరింత ఇంప్రెస్ చేశారు. ఇక కార్తి గురించి ఇంకా చెప్పాలంటే 2004లో మణిరత్నం డైరెక్షన్‌లో సూర్య హీరోగా వచ్చిన యువ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు. ఇక 2007లో పరుత్తివీరన్ సినిమాతో తెరంగేట్రం చేశాడు.చాలా తక్కువ కాలంలోనే తనకంటూ  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ్ లో నటించిన కార్తీ చిత్రాలు యుగానికి ఒక్కడు, ఆవారా ఇంకా నా పేరు శివ తెలుగులో రిలీజై ఘన విజయం సాధించాయి. కార్తి సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా అవసరం ఉన్నవారికి ఎప్పుడు సాయం చేయడం అలవాటు. అందుకే మక్కల్ నాల మండ్రం అనే సేవా సంస్థను స్థాపించి పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు కార్తీ. ఇంకా అలాగే ఫ్యాన్స్‌తో కలిసి రక్తదానం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇలాగే మంచి హిట్లు కొడుతూ సేవా కార్యక్రమాలని ఆయన కొనసాగించాలని కోరుతూ కార్తీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం.. హ్యాపీ బర్త్ డే కార్తీ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: