నరేష్ గారి లో నాకు అది నచ్చింది :పవిత్ర

murali krishna
నరేష్ పవిత్ర లోకేష్ ప్రస్తుతం రిలేషన్ లో వున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం వీరిద్దరూ జంట గా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారటా.
ఈ సినిమా మే 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారటా.. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర లోకేష్ నరేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది.. ఈ సందర్భంగా నరేష్ గురించి ఎన్నో విషయాల ను తెలియజేసిన ఈమె నరేష్ లో తనకు నచ్చిన క్వాలిటీ కూడా బయటపెట్టారని తెలుస్తుంది.
సాధారణంగా తాను ఏ చిన్న ఘటన జరిగిన చాలా తొందరగా ఆవేశ పడతానని ఆ సంగతి గురించి పదేపదే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటానని పవిత్ర తెలిపారు. కానీ నరేష్ గారు అలా కాదు ఆయన రేపటి గురించి అసలు ఆలోచించరని కూడా తెలిపారు.రేపు అనేది వస్తే తప్పకుండా ఆలోచిద్దామనే వ్యక్తిత్వం కలవారని అలాగే ఏ విషయానికి తొందరగా అస్సలు కోపంతో రియాక్ట్ అవ్వరని,ఈరోజు మనకు ఉన్నదాంట్లో సంతోష పడదాం అనుకొనే రకం నరేష్ గారు తనలో నాకు ఈ క్వాలిటీ బాగా నచ్చిందని పవిత్ర లోకేష్ తెలియజేశారటా.
ఇక అన్నిటికంటే ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారని కూడా దీనికన్నా నాకు మరి ఏది అవసరం లేదు అంటూ ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ నరేష్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఇక మళ్లీ పెళ్లి అనే సినిమాని నరేష్ జీవిత కథ ఆధారంగా చేశారని భావిస్తున్నప్పటికీ నరేష్ మాత్రం లేదనే సమాధానం చెబుతున్నారు కానీ ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ చూస్తే మాత్రం సినిమాపై భారీ అంచనాలు అయితే పెరిగిపోయాయి. మరి ఈ సినిమాని నరేష్ స్వయంగా నిర్మించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: