"మన్మధుడు" మూవీలోని ఆ పాట నాగార్జున కోసం చేసింది కాదు... దేవి శ్రీ ప్రసాద్..!

Pulgam Srinivas
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లో దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. ఈయన కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందినటువంటి "దేవి" మూవీ తో సంగీత దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం అలాగే ఈ సినిమాలోని మ్యూజిక్ కి కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. దానితో ఈ సంగీత దర్శకుడికి ఈ సినిమా తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ అవకాశాలను అద్భుతంగా వినియోగించుకున్న దేవి శ్రీ ప్రసాద్ తాను సంగీతం అందించిన ఎన్నో సినిమాలకు తన అద్భుతమైన సంగీతంతో విజయాలను అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం ఈ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో పుష్ప ది రూల్ ... ఉస్తాద్ భగత్ సింగ్ అనే భారీ క్రేజ్ ఉన్న సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. అలాగే తమిళ సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న కంగువా అనే సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల క్రితం దేవి శ్రీ ప్రసాద్ "మన్మధుడు" మూవీ కి సంగీతం అందించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ లో నాగార్జున హీరోగా నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది.

అలాగే ఈ సినిమాలోని పాటలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీలో "నేను నేను గాలేనే" అనే సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సాంగ్ కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ  సాంగ్ సంగీతాన్ని నేను నా మొదటి సినిమా కోసం చేసుకున్నాను. కాకపోతే ఆ సినిమాలో ఈ సంగీతం సెట్ అయ్యే సుచ్యివేషన్ లేదు. దానితో దీనిని పక్కన పెట్టి ఉంచాను. ఈ మూవీలో ఈ మ్యూజిక్ సెట్ అయ్యే సన్నివేశం దొరకడంతో ఈ సినిమాలో ఈ మ్యూజిక్ ని పెట్టాం అని దేవి శ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: