మేమ్‌ ఫేమస్‌: వావ్.. 99/- ధరకే టికెట్?

Purushottham Vinay
‘మేమ్‌ ఫేమస్‌’ మూవీ ఈమధ్య కాలంలో టాలీవుడ్‌లో రిలీజ్‌కు ముందే బాగా పాజిటివ్‌ బజ్‌ తెచ్చుకున్న మూవీ. టాలీవుడ్ హీరోస్ విజయ్ దేవరకొండ, నాని, నాగచైతన్య, దగ్గుబాటి రానా, అడివిశేష్‌, నవీన్ పొలిశెట్టి వంటి స్టార్‌ హీరోలందరూ కూడా ప్రమోట్‌ చేయడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి.ఈ మూవీలో హీరోగా నటించడంతో పాటు డైరెక్టర్‌ గా కూడా బాధ్యతలు  నిర్వర్తించాడు సుమంత్‌ ప్రభాస్‌. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య ఇంకా సిరి రాసి కీలక పాత్రలో నటించారు. 'రైటర్ పద్మభూషణ్' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న లహరి ఫిల్మ్స్, ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ మరో సరికొత్త మూవీను తెరకెక్కిస్తున్నాయి. శరత్‌ చంద్ర, అనురాగ్‌ రెడ్డి ఇంకా చంద్రు మనోహర్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శరత్‌, అనురాగ్‌ రెడ్డి ఇంకా చంద్రు మనోహరన్‌ సంయుక్తంగా నిర్మించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 26న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో చాలా స్పీడ్‌ పెంచారు మూవీ మేకర్స్‌. తాజాగా మేమ్‌ ఫేమస్ టికెట్ల ధరలపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు.


సాధారణంగా మూవీస్ రిలీజైనప్పుడు టికెట్ల ధరలు పెంచుతారు. అయితే మేమ్ ఫేమస్ మూవీ టికెట్లు మాత్రం కేవలం రూ.99కే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఈ మూవీ రిలీజైన రోజు కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో మేమ్ ఫేమస్ ను కేవలం రూ.99కే చూడొచ్చు. దీనివల్ల మొదటి రోజే థియేటర్లు పూర్తిస్థాయిలో నిండుతాయని, అందువల్ల తమ జనాల్లోకి మరింత వేగంగా వెళుతుందని మూవీ యూనిట్‌ భావిస్తోంది.మంచి యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన మేమ్‌ ఫేమస్ పాటలు, టీజర్లు ఇంకా ట్రైలర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.  ఈ సినిమా థియెట్రికల్ ట్రైలర్‌ను హైదరాబాద్ సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదల చేయించారు. సినిమా ట్రైలర్‌ చూస్తుంటే ఫన్ అండ్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది.ముగ్గురు స్నేహితుల మధ్య నడిచే సరదా సంభాషణలు ఇంకా ఫేమస్ కావడానికి పడే పాట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: