ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పని చేసిన థమన్....!!

murali krishna
ప్రస్తుతం మన తెలుగు సినిమాకి టాప్ 2 మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు అంటే, కళ్ళు మూసుకొని చెప్పేయొచ్చు అది థమన్ మరియు దేవిశ్రీప్రసాద్ అని.
ఎవరు నెంబర్ 1 మరియు ఎవరు నెంబర్ 2 అనేది కాసేపు పక్కన పెడితే టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ , హీరోలు మరియు నిర్మాతలు కూడా వీళ్లిద్దరి డేట్స్ కోసమే పడిగాపులు కాస్తూ ఉంటారు. ఈ సంక్రాంతికి వీళ్లిద్దరు కంపోజ్ చేసిన 'వాల్తేరు వీరయ్య' మరియు 'వీర సింహా రెడ్డి' సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలు ఈ రేంజ్ లో ఆడదానికి ప్రధాన కారణాలలో మ్యూజిక్ కూడా ఒకటి అని చెప్పొచ్చు. సినిమా కంటెంట్ ఎలా ఉన్నా కేవలం వీళ్లిద్దరి మ్యూజిక్ తో బ్లాక్ బస్టర్ హిట్ చెయ్యగలరు. ఆ సత్తా ఉంది కాబట్టే డైరెక్టర్స్ మరియు నిర్మాతలు వీళ్ళ డేట్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటారు.
అయితే థమన్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే లోపే దేవిశ్రీప్రసాద్ పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ లో చలామణి అవుతున్నాడు.ఆ సమయం లో థమన్ ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ వద్ద కీ బోర్డు ప్లేయర్ గా పనిచేసావాడు. మణిశర్మ అప్పట్లో కంపోజ్ చేసిన ప్రతీ పాట కి థమన్ పని చేసాడు, ఆయన నుండి ఎన్నో విషయాలు నేర్చుకొని కిక్ సినిమా తో మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి , పాటలు కూడా పెద్ద హిట్ అవ్వడం తో థమన్ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే కిక్ సినిమాకి ముందుగా థమన్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన ఒక సినిమాకి కీ బోర్డు ప్లేయర్ గా పనిచేసాడు. ఆ సినిమా మరేదో కాదు, అక్కినేని నాగార్జున మరియు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన కింగ్ చిత్రం. ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ప్రతీ పాటకి థమన్ కీ బోర్డు ప్లేయర్ గా పనిచేసాడు.ఇదే ఆయన కీ బోర్డు ప్లేయర్ గా పనిచేసిన చివరి చిత్రం చిత్రం కూడా.ఇండస్ట్రీ లో నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ పడుతున్న థమన్ మరియు దేవిశ్రీప్రసాద్ కలయిక గురించి తెలుసుకొని నెటిజెన్స్ పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు. ప్రస్తుతం థమన్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న 'బ్రో' చిత్రానికి మరియు రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'గేమ్ చేంజర్', మళ్ళీ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న '#OG ' అనే చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక దేవిశ్రీప్రసాద్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్', అలాగే అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: