రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ లో భాగంగా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ అయిన మొదటి రోజు అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన మూవీ లు ఏవో తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందినటువంటి ఖుషి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 3.62 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో భూమిక , పవన్ సరసన హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ కి ఎస్ జే సూర్య దర్శకత్వం వహించాడు.  యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందినటు వంటి సింహాద్రి మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.90 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఎస్ ఎస్ రాజమౌళి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. భూమిక , అంకిత ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ లుగా నటించారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇలియానా హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన జల్సా సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.57 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. మహేష్ బాబు హీరోగా భూమిక హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఒక్కడు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.90 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. మహేష్ బాబు హీరోగా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పోకిరి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.52 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. అల్లు అర్జున్ హీరోగా హన్సిక హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన దేశముదురు సినిమా మొదటి రోజు 1.46 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా జెనీలియా హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఆరెంజ్ సినిమా మొదటి రోజు 1.42 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: